అర్జున్ రెడ్డి ప్ర‌భావం పోయిందా ..

మికుల రోజు ఫిబ్ర‌వ‌రి 14న విజ‌య్ దేవ‌రకొండ హీరోగా న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ్వ‌ర్ చిత్రం విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ 7 ఏకర్స్‌లో జ‌రిన ప్ర‌త్యేక ముఖాముఖిలో విజ‌య్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సినిమాలోని అంశాల‌తో పాటు సామాజిక మీడియా ట్రోలింగ్స్‌, పెళ్లి, ప్రేమ ఇలా అనేకంపై త‌న‌దైన నిశ్చిత అభిప్రాయాల‌ను మీడియాలో పంచుకున్నారు. ఈ ముఖాముఖి సాగింది ఇలా…..
ప్రేమ‌క‌థ‌లు చేయ‌న‌ని చెప్పారు? ఏంటి సంగ‌తి…
చూస్తారుగా రానున్న నాలుగైదునెల‌ల్లో మీరే కొత్త విజ‌య్‌ని చూస్తారు. వ‌చ్చే రెండేళ్ల‌లో నేను చేసే సినిమాలు భిన్నంగా ఉంటాయి. గీత గోవిందం, అర్జున్‌రెడ్డి భిన్న‌మే అయినా దేనిక‌దే హిట్ అయ్యింది. నేను ప్రేమ‌క‌థ‌లు చేయ‌నంటున్నా.. అని అన‌లే… ఆటోవాలా లాంటి సినిమాల‌లో ప్రేమ అంత‌ర్లీనంగా ఉండాలి అనుకుంటున్నా. పూరీ జ‌గ‌న్నాధ్‌గారి సినిమాలోనూ ప్రేమ‌క‌థ ఉంటుంద‌నుకుంటున్నా… మాస్ యాక్ష‌న్ చేసినా ప్రేమ ఉంటుంది… లేకుంటే సినిమా ఎలివేట్ కాదు. 

అర్జున్ రెడ్డి ప్ర‌భావం మీ మీద నుంచి పోయిన‌ట్టు లేదుగా…
అవును… నేను ప్రేమ‌క‌థ చేసినా, యాక్ష‌న్ సినిమా చేసినా సైంటిఫిక్ సినిమా చేసినా న‌న్ను అర్జున్ రెడ్డిగానే ఇంకా ప్ర‌జ‌లు గుర్తిస్తున్నారు. అర్జున్ రెడ్డి సూప‌ర్ హిట్ యూత్ మీద ప్ర‌భావం చూపింది క‌దా?

ఒక్క భామ‌తో ప్రేమాయ‌ణం బోర్ కొట్టి న‌లుగురితో ఎంత డిఫ‌రెంట్ చూపిస్తారు. 
ప్రేమ బోర్ కొట్టింది అంటే అమ్మాయిలు ఫీల్ అవుతారు. కానీ నాకు ఈ సినిమా కొత్త అనుభూతి, చ‌దువు సంధ్య‌లేని ఓ మారుమూల ప‌ల్లెల‌లో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌. ఐశ్వ‌ర్యా రాజేష్‌తో చేసిన ఇల్లందు ఎపిసోడ్ చాలా న‌చ్చింది. ప్రేమ క‌థ భిన్నంగా ఉంటుంది. కాలేజ్‌లో ఫ‌స్ట్‌ల‌వ్ ఇలా మూడు ప్రేమ‌క‌థ‌లు ఉన్నాయి.

ఈ ప్రేమ‌క‌థ‌ల‌కి రిలేష‌న్ ఉందా?
నేనే ఉంటాను అన్నింటిలోనూ ఉన్న‌ది క‌దా? ఎలా ఉంట‌ద‌న్న‌ది శుక్ర‌వారం చూడండి… ముందే చెప్పేస్తే ఎలా?

ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ క‌న్న విజ‌య్ ఎక్కువ బాధ్య‌త తీసుకున్నాడ‌ని నిర్మాత కెఎస్ రామారావుగారంటున్నారు నిజ‌మేనా?
ఆయ‌న‌కి అలా అనిపించిందేమో? క్రాంతిదే పూర్తి భ‌రోసా. క్రిడిట్ మొత్తం ఆయ‌నిదే, ఆత‌ని బ్ర‌యిన్ చైల్డ్ ఇది. న‌టుడిగా నా బాధ్య‌త నెర‌వేర్చాను. 

మీ క్యారెక్ట‌ర్ గురించి చెప్పండి
ప్రేమ‌లో దైవ‌త్వం చూపించే పాత్ర‌లు బోలెడు క‌నిపిస్తాయి. నేను చెప్పితే మీరు సినిమా చూడ‌రేమో. ఈ సినిమాలో ఫిజిక‌ల్ వేరియేష‌న్స్ క‌నిపిస్తాయి. డిఫ‌రంట్ పాత్ర‌లు. సీన‌య్య పాత్ర మాత్రం న‌న్ను క‌ట్టిప‌డేసింది. 

ఇలాంటి పాత్ర‌లు నిజ‌జీవితంలో చూసారా?
పెళ్లిచూపులు త‌ర‌హా క్యారెక్ట‌ర్లు నాకు చాలా క‌నిపించాయి

చాలా ప్రేమ‌పై మీ అభిప్రాయం ఏంటి?
ప్రేమ ఓ నాన్సెస్ కాన్స‌ప్ట్ అని నేన‌నుకునే వాడిని, గ‌తంలో… ప్రేమ‌…. త‌రు వాత బ్రేక్ అప్‌… మ‌ళ్లీ ప్రేమ‌…. ఇలా చూసాను. ముందు అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి క‌లిస్తే వీడేమైపోతాడో అనిపించేంది. మామా… ఇది ట్రూల‌వ్ అనుకున్న వాళ్లు ఇబ్బంది ప‌డిన వాళ్లు నాకు తెలుసు… జీవితంలో ఎప్ప‌టికీ గుర్తుండేది అమ్మ‌, నాన్న‌, అక్క‌, చెల్లి, త‌మ్ముడు, అన్న ఇలా కుటుంబ స‌భ్యులు , స్నేహితులు న‌డుమ ఉన్ననిజ‌మైన ప్రేమ‌. ఇది ప‌టిష్ట‌మైంది. 

అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?
చెప్ప‌లేను… నేను ఇంకా పిల్లాడినే నా కెరీర్ ప‌రంగా… చేసుకుంటా… మీ అంద‌రికీ చెప్పే… అయినా అందుకు మాన‌సికంగా సిద్దం కావాలి. 

న‌లుగురు హీరోయిన్ల‌తో చేసారు. వారిలో ఏ పాత్ర మీకు బాగా న‌చ్చింది.
సువ‌ర్ణ పాత్ర చాలా బాగుంది. ఇది చాలా కొత్త‌గా ఉంటుంది. అయితే దేనిక‌దే విభిన్నం.అని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. అన్నీ పాత్ర‌ల‌లో క్రాంతి క‌నిపిస్తాడు. 

సీన‌య్య పాత్ర ఎలా చేసారు. స్పూర్తి ఎవ‌రు?
ఇంకెవ‌రు. మా నాన్నే, చిన్న‌ప్పుడు నాన్న‌ని ద‌గ్గ‌రుండి ప‌రిశీలించాను. నాన్న నా మ‌న‌సులో ముద్ర ప‌డిపోయింది. ఈ స్క్రిప్ట్ చ‌దువుతున్న‌ప్పుడు నాన్నే గుర్తుకొచ్చాడు. లుంగీ క‌ట్టుకునే విధానం, న‌డ‌వ‌టం, మాట్లాడ‌టం, అమ్మ‌ని గ‌ద‌మాయించడం, ప‌డుకోవ‌టం ఇలా అన్నీ నాన్న నే గుర్తు చేసుకుని మ‌రీ న‌టించా.

టైటిల్ ఇలా పెట్టారని అనుకున్నారా? 
లేదండీ చాలా పేర్లు ప‌రిశీలించాం. ప్రియ‌మ్‌, 96 త‌ర‌హాలో ముంబై తీర‌మ్ అని అనుకున్నా, క‌థాప‌రంగా ఈ టైటిల్ చాలా బాగుంద‌నిపించి ఫైన‌ల్ చేసాం. సినిమా పేరు ఎక్స్‌వైజెడ్ అని పెట్టినా నాకు అభ్యంత‌రం ఉండ‌దు.

సినిమా సిక్స‌ర్ కొడుతున్నారా?
ప్ర‌స్తుతం బాల్ గాలిలో ఉంది… అది స్టేడియం అవ‌త‌ల ప‌డుతుందా? ఎవ‌రైనా క్యాచ్ ప‌డతారా? అన్న‌ది చూడాలి. 

డియ‌ర్ కామ్రెడ్ లో బాబీ పేరు ఈ మ‌ధ్య మ‌ళ్లీ వినిపిస్తోంది. 
బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ ఇలా ఐదు దేశాల‌లో సినిమాని యూట్యూబ్‌లో చూసి మెచ్చుకున్నారు. అంతెందుకు పూరీగారి సినిమా 
ముంబైలో చేస్తున్న‌ప్పుడు న‌న్ను బాబీ… బాబీ అని పిలవ‌టం ఆనందాన్ని ఇచ్చింది. 

యాంటీ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఏమంటారు?
నేను చాలా ప్రేమిస్తా, వాటిని అవి మన చుట్టూ ఉండాలి. మ‌న‌కోసం ప‌డుకునేట‌ప్పుడు కూడా ఆలోచించి మ‌రి కొంత స‌మ‌యం కేటాయించి పోస్టులు చేస్తుండ‌టం మ‌న‌ల్సి ట్రోల్ చేయ‌టానికి ఎంత ప్రేమ ఉండాలి అని పాజిటివ్‌గా తీసుకుంటా.

కొత్త ద‌ర్శ‌కుల‌కే ప్రాధాన్యం ఎందుకు?
పెళ్లి చూపుల నుంచి కొత్త‌ద‌నంగా క‌నిపించాల‌ని ఆకాంక్షిస్తున్నా నేను చేసిన గ‌త 8 సినిమాలో 6 కొత్త ద‌ర్శ‌కుల‌తో చేసిన‌వే. నాకు క‌థ‌, క‌థ‌నాలే ప్ర‌ధానం, కొత్త‌ద‌నం ఆశ్వాదించాలి. ప్రేక్ష‌కుల‌ని మెప్పించాలి. ఇందుకు కొత్త పాత అని తేడాలుండ‌వు క‌దా?

Leave a Reply

Your email address will not be published.