చూద్దాం… కాలం కలసి రావాలి కదా… వెంకటేష్

హైదరాబాద్ లోని శిల్పకళావేదికపై తెలంగాణ సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై ఆరంభించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన కార్యక్రమాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా రంగు రంగుల రంగవల్లులు, హరిదాసులు, జంగందేవరలు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల విన్యాసాలు సందర్శకులను అలరించాయి. ఈ వేడుకలలో తెలంగాణ హిమాచల్‌ప్రదేశ్ ల గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయలతో పాటు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, తెలుగు సినీ హీరోలు వెంకటేశ్, మహేశ్ బాబు హాజరయ్యారు.
కాగా గత కొంత కాలంగా కుర్ర హీరోలతో కలసి నటిస్తున్న వెంకటేష్ ఇటీవలే అసురన్‌తో తిరిగి సోలో హీరోగా వస్తుంటే తాజాగా
శిల్పారామంలో సంక్రాంతి వేడుకలలో ఒకే వేదికపై మహేశ్‌బాబుతో కలసి కనిపించడంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రావాలంటూ ఇరువురి అభిమానులు కోరుకుంటుండటం…. ఇదే అంశాన్ని వేదికపైకి కొందరు చేరవేయగా…. చూద్దాం… కాలం కలసి రావాలి కదా అంటూ వెంకటేష్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.