‘బంగారు బుల్లోడు’ అప్ డేట్స్ బయటికి రాక పోవటానికి కారణం ఇదేనా

ఒకప్పుడు కామెడీకి కేరాఫ్‌గా నిలచిన అల్లరి నరేష్ ఒకే తరహా చిత్రాలు చేయటంతో వరస పరాజయాలని మూట గట్టుకోవలసి వచ్చింది. నాలుగైదు సినిమాలు చేస్తూ హుషారుగా ఉండే ఈ కుర్రహీరో చివరికి ఒక్కో సినిమా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ సినిమా ఆరంభమైన అది ఎప్పటికి పూర్తవుతుందోనన్న ఆందోళలో ఉన్నాడనే చెప్పాలి. షూటింగ్ లో ఉన్న బంగారు బుల్లోడు గురించి కనీసం అప్ డేట్స్ కూడా బయటికి రాక పోవటమే ఇందుకు ఉదాహరణ. తాజాగా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన నరేష్ చాలా సీరియస్ గా తనకు వచ్చే రోల్స్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తన కొత్త మూవీ నాంది ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఇటీవల విడుదల చేశారు. ఇందులో లాకప్ లో సంకెళ్ళతో నగ్నంగా రివర్స్ లో వేలాడదీసిన స్టిల్ లో చాలా తీవ్రత కనిపిస్తోంది. మాసిన గెడ్డంతో మొహమంతా రఫ్ నెస్ తో అల్లరి నరేష్ కనిపిస్తుండటం చూస్తుంటే విజయ్ కనకమేడల దర్శకుడిగా ఏదో ప్రయోగం చేస్తున్నట్టే కనిపిస్తోంది.