రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

మాయమాటలే తప్ప ఆచరణ శూన్యం
-కేసీఆర్ యేడాదిపాలనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 

టిఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి సారి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఇటువంటి సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ముందుకు మరోసారి తీసుకొస్తున్నాను.

– రెండుసార్లు ఈ సంవత్సరం కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కేవలం ఆరు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది దేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, పాలన గతి తప్పుతుంది అని చెప్పడానికి మొదటి అడుగు ఇక్కడే పడింది. లక్షా ఎనభై రెండు వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆరు నెలల తర్వాత మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. లక్షా నలభై ఆరు వేల కోట్లతో. సహజంగా బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి తర్వాత పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ కి 30 వేల కోట్ల రూపాయలు తగ్గుదల ఉన్నది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది. ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేదు. సరైనటువంటి ఆర్థికపరమైన పరిపాలన ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేదు.

తనకు కావలసిన ఒకటి రెండు ప్రాజెక్టులను, తను అవినీతి చేయడానికి బాగా ఆస్కారం ఉన్నటువంటి ప్రాజెక్టులు తీసుకొని, ఉదాహరణకి కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టు, రీజనింగ్ చేసినటువంటి సీతారామ ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులు తీసుకున్నారు. నూతనంగా వచ్చినటువంటి రాష్ట్రంలో బడ్జెట్ సర్ ప్లస్ లో ఉంది. ఉన్నటువంటి ఆదాయంతో అద్భుతంగా అభివృద్ధి చెల్లించాలి.  రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలకి  పూర్తిగా దివాళా తీయించాడు కెసిఆర్.  ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి రాబడితో రాష్ట్ర అభివృద్ధి కోసం సరైనటువంటి ప్రణాళికతో ఇన్వెస్ట్ చేస్తే gsdp పెరుగుతూ ఉండేది. ఎప్పుడైతే రెవెన్యూ పెరగడానికి రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడానికి సరైనటువంటి ఆలోచనతో ప్రణాళికలు రూపొందించగా పోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది.  రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చే వనరుల ద్వారా ఆదాయంలో ఇన్వెస్ట్ చేస్తే రాష్ట్ర ఆదాయం పెరిగేది. మొదటి ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేసినటువంటి ఆదాయాల లతో రాబడి పెరుగుతూ వచ్చింది. ఈ ఐదు సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ తో ఇప్పుడు ఆదాయం పడిపోయింది. అందుకే రాష్ట్రాన్ని చేతులెత్తేసి రెండు లక్షల కోట్లు దాటుతుందని చెప్పిన ముఖ్యమంత్రి బడ్జెట్ ని లక్షా నలభై మూడు కోట్లకు కుదించారు. ఇది కూడా అ రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ కిందికి వచ్చేసరికి ఎంత అవుతుందో చెప్పలేం. ఇవన్నీ అంచనాలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దివాళా తీశారు. భవిష్యత్తు అంతా తెలంగాణ ఆందోళనగా, అగమ్యగోచరంగా తయారు చేశారు. ఆరు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూద్దామంటే ఎక్కడా కనిపించడం లేదు. ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి ఒక ఎకరానికి కూడా నీళ్లు వెళ్లలేదు. చివరికి కాలేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కూడా. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ రాష్ట్ర ఆదాయం అంతా అయిపోయింది. దివాలా తీయించారు. మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇంకా అప్పు తీసుకొస్తామని చెబుతున్నారు. ఇది ఆర్థిక పరిస్థితి.


నీరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరికీ ఉద్యోగాలు లేవు. చెప్పిన ఉద్యోగాలు ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగలేదు. ఏ ఒక్క యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ లేరు. అలాగే చెప్పిన హామీలు ఏమైనా పూర్తి చేశారు అంటే అది లేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు సంవత్సరం అయిపోతుంది దాని ఊసే లేదు. మూడెకరాల భూమి లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. కనీసం సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేవు. ఆరు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక్క గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు సేకరించినట్లు పరిస్థితి లేదు. గత ప్రభుత్వాల హయాంలో ప్రతి సంవత్సరం ఇల్లు కడుతూనే ఉండేవాళ్లు. స్థలాలు సేకరిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి సంవత్సరం అసైన్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టి భూపంపిణీ జరుగుతూ ఉండేది. ఆరు సంవత్సరాల నుంచి అసైన్మెంట్ కమిటీ రద్దు చేశారు. భూపంపిణీ లేనేలేదు.

57 సంవత్సరాల కి పెన్షన్ ఇస్తా అన్నారు. దానికి ఊసే లేదు. రైతుబంధు పథకానికి సంబంధించి ఇంతవరకు డబ్బులు విడుదల చేయలేదు. కేవలం హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా అక్కడ మాత్రమే విడుదల చేశారు. 

పోనీ ఇంకేమైనా పరిపాలన సరిగా ఉంటుంది అంటే ప్రజలకి పనికి వచ్చేటటువంటి సంక్షేమ రంగం పూర్తిగా పక్కన పడేశారు. వైద్య రంగం పూర్తిగా చేతులెత్తేసింది. కొన్ని వందల, వేల మంది డెంగ్యూ లాంటి విష జ్వరాలతో విపరీతంగా చనిపోయారు. ఆస్పత్రులలో మెట్ల మీద, చెట్ల మీద, కుర్చీల మీద కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కో బెడ్ మీద ముగ్గురు, నలుగురు ని పెట్టి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి వచ్చింది.

అట్లాగే పోనీ శాంతిభద్రతలు బాగున్నాయి అనుకుంటే ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా మహిళలపై ఆకృత్యాలు ఇది సర్వసాధారణ కార్యక్రమంగా రాష్ట్రంలో తయారైంది. ఇది మరి భయంకరం. వరంగల్ లో మానస,  హైదరాబాద్ దిశ, కొమరం భీమ్ జిల్లా సమత, జడ్చర్ల  లో హర్షిని, సంగారెడ్డిలో మందర, హాజీపూర్ లో శ్రావణి, కరీంనగర్ మూసాపేట్ లో జానకి, హుస్నాబాద్ లో లావుడియా కల్పన, సంధ్యారాణి నల్గొండలో సునంద, వరంగల్ ప్రియాంక, ఖాజీపూర్ లో కల్పన, రామకృష్ణాపూర్ శైలజ ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు. ఇటువంటి సంఘటనలు. నేరాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 

 ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ప్రజలకు పాలన లేదు. మహిళలకు రక్షణ లేదు. రైతులకు చెప్పినటువంటి పథకాలు లేవు. గిట్టుబాటు ధర లేదు. రుణమాఫీ లేదు. ఏంటి మరి సాధించి తెచ్చుకున్న  తెలంగాణలో మనం సాధించుకున్న ఏంటయ్యా అంటే రాష్ట్రాన్ని దివాళా తీయడం సాధించింది. ఏమీ లేదు. ఎవరైనా మాట్లాడితే వారి మీద అక్రమంగా కేసులు పెట్టడం. మీడియాను పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి వారి చెప్పు చేతుల్లో పెట్టుకుని లాగా చేసుకున్నారు. అసెంబ్లీ లో ఎవరైనా మాట్లాడదామంటే మైక్ కట్ చేస్తారు. అంతిమంగా ఇంకా అప్పులు చేస్తానని చెప్పడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఒక భయానటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించి ఒక నియంత లాగా, వాస్తవ పరిస్థితిని బయటికి రాకుండా అందులో మగ్గి పోయేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం.  మాట్లాడితే gdp పడిపోయిందని సాకు చెబుతున్నారు. GSDP పడిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం. GSDP పడిపోవడానికి కారణం ముఖ్యమంత్రి. నువ్వు తీసుకున్న ఇటువంటి నిర్ణయాలు ఆర్థికపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు రాష్ట్రం దివాలా తీసింది. ఇంకా బాగా లోతుల్లోకి వెళితే ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది అని చెప్పుకోవడానికి ఒకే ఒక రంగం కనిపిస్తుంది. ఆ రంగమే మద్యం అమ్మకాలు. మద్యం అమ్మకాలు పెంచి పోషించి ఒక ఊరికి బెల్టుషాపులు పెట్టించి,  మెయిన్ రోడ్డలో వైన్ షాప్లు ,  ప్రధాన రోడ్లపై నా షాపు పెట్టించి అడ్డగోలుగా ఆదాయాన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు.  తాగండి, తాగండి, తాగండి. తాగి  మత్తులో ఉండండి. మీరేమి ఆలోచించే పరిస్థితులు రాకూడదు ఆ మత్తులో ఉంటే నా పని నేను చేసుకోవచ్చని ఆలోచనలు విపరీతంగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తప్ప రాష్ట్ర ప్రగతి శూన్యం. 

ఒక దుర్మార్గుడు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది వారు కోల్పోయింది ఏమిటి అని.  వారి కోల్పోతున్నది ఏమిటి అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. తప్పనిసరిగా కెసిఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక కార్యాచరణ ప్రణాళిక  ప్రకటించి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రానికి ప్రజలకు తెలియజేస్తున్నాను మద్యం అమ్మకాలు కూడా కట్టడి చేయాలని కోరుతున్నాం. బెల్టు షాపులు మూసేయాలి, ఎత్తి వేయాలి. ప్రధాన రోడ్లపై ఉన్నటువంటి వైన్ షాప్ బంద్ చేయాలి. రైతు రుణమాఫీ ఇది ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తానని చెప్పిన హామీ జరగలేదు. 

మద్యం అమ్మకాలతో పాటు ఈ దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన అంశం ఏంటంటే రాజ్యాంగంలోని ఫిరాయింపు చట్టాన్ని తుంగలో తొక్కి ఎక్కువ మంది శాసనసభ్యులు పార్టీలో కలుపుకోవడం కూడా కేసీఆర్ ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్. 

కాళేశ్వరం ప్రాజెక్టు పై గతంలో అసెంబ్లీలో కూడా చాలెంజ్ చేశాను. మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేసిన నీటిని ఒక్క చుక్క నీరు కూడా ఎకరానికి  పారించలేదు. ఇప్పుడు వస్తున్న నీరు అంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినట్టు వంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వస్తున్న నీరే. శ్రీపాద ఎల్లంపల్లి లోకి వచ్చే నీరు కూడా పైనుంచి గోదావరి ఆ పైన ఉన్నటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వ కటించినటువంటి కడెం ప్రాజెక్టు నుంచి వచ్చేవి.  కడెం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన అటువంటి  ప్రాజెక్టు వచ్చి లోయర్ మానేరు,  లోయర్ మానేరు నుంచి చ గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo కట్టించిన ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా నీరు పారుతోంది.  ఈనాటి వరకు లక్ష కోట్లు ఖర్చుపెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు కారడం లేదు. 


ఖమ్మం జిల్లాకు కూడా ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ సంబంధించి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి.  సంవత్సరానికి 500 కోట్లు రిలీజ్ చేసిన మొదటి మూడు సంవత్సరాల్లోనే నీళ్లు పడేవి. ఆరు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల నుంచి జిల్లాలో గోదావరి నీరు పారుతూ ఉండేవి.  అవి దాన్ని రీ డిజైన్ చేసి కేవలం పదిహేను వందల కోట్లతో అయ్యేదాన్ని 15 వేల కోట్లకు పెంచారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క చుక్క నీరు కూడా అందులో నుంచి బయటికి రాలేదు.  

 ప్రభుత్వ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నాము. ఆందోళనలు, మేం చేస్తున్న కార్యక్రమాల్ని మీడియా ద్వారా రాకుండా కెసిఆర్ కొన్ని పత్రికలు, ఛానెల్స్ ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు రాస్తే వాళ్లపై ఒత్తిడి చేస్తున్నారు. మొదటి ఐదు సంవత్సరాల్లో gsdp పెరగడానికి కారణం గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచి పనులు వల్లే. సామాన్య ప్రజలకు ఇది అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. రాష్ట్రంలో ఉన్న మీడియా ప్రతినిధులకు, రాజకీయనాయకులకి, మేధావులకి , భవిష్యత్తు గురించి ఆలోచించే వారికి ఇప్పటికే పరిస్థితి అర్థం అయిపోయింది. ఉప ఎన్నికల్లో ప్రబో లోపాలు పెట్టి అధికార యంత్రాంగం ఉపయోగించుకొని గెలిచారు. కానీ దీనికి ఒక ఉదాహరణ పాలేరు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తచేశారు.

Leave a Reply

Your email address will not be published.