దిశ పీఎస్‌ ప్రారంభం పేరుతో సీఎం జగన్ అబద్ధపు ప్రచారం

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాజమండ్రిలో ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లపై ఆమె దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యకర కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే భవానీకి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మహిళా కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శాసనసభలో మద్యం అంశంపై మాట్లాడినందుకు తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేశారని భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసి రెండు నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దిశ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఇంకా చట్టం అమల్లోకి రాలేదని అంటున్నారని తెలిపారు. అంటే దిశ పీఎస్‌ ప్రారంభం పేరుతో సీఎం జగన్ అబద్ధపు ప్రచారం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Leave a Reply

Your email address will not be published.