కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జాతీయ జండాని ఎగరవేశారురాజ్యాంగ పరమైన హక్కులను, అభివృద్ధి ని నేటి పాలకులు దోచుకుంటు సామాజిక భద్రత ను నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. రాజ‌మండ్రిలోని పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన గణతంత్ర దినోత్సవ వేడుక‌ల‌లో ఆయ‌న పాల్గొని జాతీయ జండాను ఆవిష్కరించి మాట్లాడుతూ రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చి 71ఏళ్లవుతున్నా సగటు ప్ర‌జ‌లకు భద్రత లేదని, ఆకలితో అలమటిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. సంపదను దోచుకుని విదేశాలకు పారిపోతున్నా ప్ర‌భుత్వం ప్రజలను భయభ్రాంతుల‌కు ప్రలోభాలకు గురిచేస్తోంది మిన‌హా దోపిడి దారుల‌ను ప‌ట్టుకోలేక పోతోంద‌న్నారు. 
స్వాతంత్ర ఫలాలను నేటికి మెజారిటీ ప్రజలు పొందలేక పోతున్నాయ‌ని, ఉగ్ర‌వాద భూతాన్ని అధికంగా ఎదుర్కొంటున్న‌ ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ మహిళలు కన్నా భారత్ లో మహిళలు ఎక్కువగా భయబ్రాంతులకు గురవుతున్న ప‌రిస్థితి నెల‌కొన‌టం బాధా క‌ర‌మ‌న్నారు. ప్రతి పౌరుడు భయాన్ని విడిచి సామాజిక భద్రత కొరకు నూతన ప్రజా స్వామ్య నిర్మానానికై ఉద్యమించాలని అయన మాట్లాడారు.


Leave a Reply

Your email address will not be published.