మళ్ళీ ప్రజల మధ్యకు యాత్ర పేరుతో రానున్న వైఎస్ జగన్..

‘ప్రజా సంకల్ప యాత్ర’ ద్వారా ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకుని అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తున్న ఏపి సిఎం వైఎస్ జగన్.. మరోసారి గ్రామాల బాట పట్టేందుకు సిద్దమువుతున్నారని తెలుస్తోంది. ప్రజా సమస్యలను మరింత లోతైన అధ్యయనం చేయటంతో పాటు రాజధాని విషయంపై జనంలో అవగాహన కలించేందుకు ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల లో పర్యటించాలని నిర్ణయించినట్టు సమాచారం.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారని వినిపించింది. జనం సమస్యలు తెలుసుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో జగన్ నడవనున్నాన్న ప్రచారం జరిగింది.. కాగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి గ్రామాల్లో పర్యటించాలని సిఎం నిర్ణయించారని, సంక్షేమ పథకాల అమలు, పనితీరు, ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక తీరును ప్రజల అభిప్రాయాలను సీఎం నేరుగా తెలుసుకోనున్నారని అధికారిక సమాచారం.
అయితే తండ్రి ఎక్కడయితే తన పయనాన్ని ఆపేశారో అక్కడ్నుంచి మొదలు పెట్టాలని జగన్ భావిస్తున్నారట.. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకునే పనిలో అధికారులు ఉన్నారు.. గతంలో జగన్. పాదయాత్రకు రూట్ మ్యాప్ నుంచి ఇప్పటివరకు జగన్‌కు సంబంధించిన కార్యక్రమాలను తయారు చేస్తున్న తలశిల రఘురామ్కే తాజా రూట్ మ్యాప్ తయారీ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించే లక్ష్యం చేరువయ్యేలా శుక్రవారం సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ పట్టాల పంపిణీ రచ్చబండ నుంచే ఆరంభించాలని భావిస్తున్నట్టు సమాచారం.