హ్యాపీ బర్త్ డే ప్రెసిడెంట్ గారు!

జగపతిబాబు అలియాస్ జగ్గూ భాయ్!.. పరిచయం అవసరం లేని పేరు ఇది. ఇతర సీనియర్ హీరోలు చాలామంది ఫేడవుట్ అయిన దశలో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూ-టర్న్ తీసుకున్న జగపతిబాబు ఒక్కసారిగా మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడమే కాకుండా సౌత్ భాషలన్నిటిలో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్ గా మారారు. సౌత్ తో పాటు, హిందీలో అజయ్ దేవగన్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆయన జన్మదినం(ఫిబ్రవరి 12) సందర్భంగా ‘సైరా’ టీమ్ ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ‘వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సైరా నుండి #వీరారెడ్డి డైనమిక్ లుక్ ను విడుదల చేస్తున్నామని తెలిపారు. వీరారెడ్డిగా జేబీ లుక్ పవర్ఫుల్ గా ఉంది. ‘సైరా’ టీమ్ మాత్రమే కాదు. జగ్గూభాయ్ కి సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది మెగా ఫ్యాన్స్ ‘హ్యాపీ బర్త్ డే ప్రెసిడెంట్ గారు’ అంటూ ‘రంగస్థలం’ టచ్ ఇవ్వడం ఆసక్తికరం.