ప్రేమకు సజీవ సాక్ష్యం బందరు సెయింట్ మేరీస్ చర్చి

సలీం, అనార్కలి స్థాయికి సరితూగగల ప్రమ కథ ఇది. అది కూడా మన తెలుగునాట జరిగిన అధ్భత ప్రేమ కాల క్రమంలో మరుగున పడుతున్నా, 212 ఏళ్ళ క్రితం నాటి ఈ నిస్వార్ధ ప్రేమ చరిత్రలో వెలుగు చూడలేక పోయినా చారిత్రికంగా సజీవమై నిలుస్తూ, ఎందరో ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రేమ కథకు సంబంధించిన వివరాలని తెలుసుకోవాలంటే… భారతదేశం లోని పలు పురాతన చర్చలలో ఒకటిగా కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన బందరులో సెయింట్ మేరీస్ చర్చి నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపధ్యం కాస్త నెమరు వేసుకోవాల్సింది.
బ్రిటిష్ దళాలు బందరు కోట ప్రాంతంలో క్రీస్తుశకం 1800 ప్రారంభంలో నివాసం ఏర్పరచుకొని పాలన సాగిస్తున్న కాలమది. మచిలీపట్నం ముఖ్య ఓడరేవు పట్టణం కావడంతో ఇక్కడ నుంచే బ్రిటీష్ పాలకులు పశ్చిమ దేశాలతో ఎగుమతులు దిగుమతులు విరివిగా చేసేవారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ కాలనీలు, సైనిక స్థావరాలు ఉండేవి. సైనికాధికారులు… కుటుంబాలతో కలసి ఇక్కడే ఒక చిన్న క్రైస్తవ ఆరాధనా కుటీరంగా సెయింట్ జాన్ ది డివైన్ చర్చి ఏర్పాటు చేసుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కు చెందిన సైనికాధికారులకు, ఉద్యోగులకు ఇదే ఏసుక్రీస్తుని ఆరాధించుకునేందుకు ప్రత్యేక ఆలయం.
విధుల నిర్వహణ లో భాగంగా ఈ ప్రాంతానికి కెప్టెన్ రాబిన్ సన్ తన అందమైన కుమార్తె అరబెల్లా తో కలసి ఇక్కడి కాలనీలోనే ఉండేవాడు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం బందరు పోర్ట్ కు ఒక మేజర్ జనరల్ జాన్ పేటర్ పంపింది. ఆ సమయంలో బ్రిటిష్ ఉన్నతాధికారుల కుటుంబాల జరిగిన ఓ గెట్ టు గెదర్ విందు సమావేశంలో అరబెల్లా- జాన్ పేటర్ ఒకరినొకరు చూసుకుని, . తొలిచూపులోనే ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ వారి మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచే దిశగా సాగింది. అడపా దడపా సందర్భాను సారంగా కలుసుకుంటూ తమ ప్రేమబంధం మరింత పటిష్టం చేసుకున్నారు. అయితే వీరి ప్రేమను అంగీకరించేందుకు నిరాకరిం అరబెల్లా తండ్రి రాబిన్సన్ అరబెల్లా- జాన్ పేటర్ ప్రేమని చిదిమేసే విలన్ పాత్ర పోషించాడు. ప్రేమీకుడుకి దూరంగా ఆమెను ఇంగ్లాండ్ కు బలవంతాన పంపించేసాడు. నాటి మత పెద్దలకు పెద్ద మనసు కరువై, వారి ప్రేమను పెళ్లిగా మార్చేందుకు నిరాకరించారు. కాల గమనంలో నాలుగేళ్లు విదేశాలలో ఉన్నా గడిచాయి. ఆమెకు జాన్ పేటర్ మీద ప్రేమ తగ్గడం లేదు ఆ క్రమంలో మానసిక వేదనతో అరబెల్లా కుంగిపోసాగింది. ఇటు పేటర్కూ అంతే అరబెల్లాపై ప్రేమ తగ్గ లేదు. బెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్ సన్ మనసు మెత్తబడలేదు సరికదా మరింత కఠినంగా వ్యవహరించడం ఆరంభించడంతో పేటర్ లో నిరాసక్తత నిర్లప్తిత పెరిగింది. పోర్ట్ సంబంధిత పనుల్లో కేవలం యాంత్రికంగా పనిచేయటం అధికారులు కూడా గమనించారు.
ఈ క్రమంలో ఇక తన తండ్రి కెప్టెన్ రాబిన్ సన్ మనస్సు ఎన్నటికీ కరగదని, తమ పెళ్ళికి ఒప్పుకోకపోయినా సరే.. తన వివాహ జీవితం గూర్చి నిర్ణయం తీసుకోక తప్పదంటూ అరబెల్లా ఇల్లు వదిలి నేరుగా ఇంగ్లాండ్ నుంచి ఓడ ఎక్కి జాన్ పీటర్ వద్దకు దైర్యంగా కట్టుబట్టలతో వచ్చేసింది దీంతో బందరులో వీరి ప్రేమ గురించి అందరికీ తెలిసి అప్పటిలో ఒక సంచలన వార్త అయ్యింది. ఎక్కడ చూసినా. వీరి ప్రేమ గూర్చి పెద్ద చర్చ జరిగింది.
జాన్ పీటర్ జీవితంలో ఊహించని ఆనంద క్షణాలు స్వంతమయ్యాయనే సంతోషంలో పెళ్లికి ఏర్పాట్లని ఆరంభించాడు. అరబెల్లా కోరిక మేరకు లండన్ నుంచి వజ్రపు తునకలు పొదిగిన వెడ్డింగ్ గౌన్కూ, డైమండ్ రింగ్కూ టెలిగ్రాఫ్ ద్వారా ఆర్డర్ పంపాడు. వివాహానికి సంబంధించిన పెళ్లి దుస్తులు ఇంగ్లాండ్ నుంచి ఓడలో బందరు రేవుకి వచ్చేశాయి. ఇవన్నీ కళ్లముందు మెదులుతుంటే పెళ్లి గురించి అందరి ఆడపిల్లల మాదిరిగానే ఎన్నో రంగురంగుల కలలు కన్నది అరబెల్లా.
ఎప్పటి మాదిరిగా బ్రిటిష్ అధికారుల ఆత్మీయ కలయిక జరుగుతున్న సమయంలో స తమ పెళ్లి విశేషాలను ‘ జాన్ పేటర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పెద్దల సమక్షంలో న్యాయబద్ధంగా తాము వివాహం చేసుకొంటున్నట్లు ప్రకటించారు. పెళ్ళి వేడుకలకు ఎవరెవరిని ఆహ్వానించాలనే ఆదుర్దా,.. పట్టరాని సంతోషంతో అరబెల్లాకి భోజనమే చేయాలనిపించ లేదు. ఇది ఆమెని నీరసంకి గురి చేసాయి. అయితే ఇది మలేరియా జ్వరం తెచ్చిన లక్షణాలు గా వైద్యులు గుర్తించడంతో అరబెల్లా మంచం పట్టింది. వైద్య సహాయం అందించే ప్రయత్నం ఎంత చేసినా 1809, నవంబర్ 6 వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచింది.
తన కోసం అందరినీ వదిలి వచ్చిన అరబెల్లాకు తానేమీ చేయలేకపోయాననే వేదనతో జాన్ పేటర్ కృంగిపోయాడు…తన అరబెల్లా నిత్యం తనతోనే ఉండాలని వందల ఏళ్ళు చెక్కుచెదరని విధంగా ఆమె పార్ధీవ దేహాన్ని రసాయనాలతో పూసి, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వెడ్డింగ్గౌన్ ని ఆమె నిర్జీవ దేహానికి తొడిగి..అచ్చం పెళ్లి కూతురి మాదిరిగా అలంకరించాడు. తాను సూటు ధరించి ఆమె నిర్జీవ దేహం చేతి వేలికి ఉంగరాన్ని తొడిగి ఆమెను పెళ్లడాడు. . ఆమె నుదిటిపై ప్రేమగా ముద్దాడిన జాన్ పీటర్ కనుల నుండి కన్నీళ్లు వర్షిస్తున్నా జాగ్రత్తగా పైకి లేపి ఆ పార్థీవ దేహాన్ని ఓ గాజు పెట్టెలో భద్రపరిచాడు.
ఇక ఆమెను ఖననం చేయాలని పీటర్ అనుకున్నా అప్పటికే వారి ప్రేమను అంగీకరించని కాథలిక్ మత పెద్దలు పట్టణంలో ఉన్న ఏ శ్మశానవాటికలోకీ ఆరబెల్లా మృతదేహానికి ఖననం చేయడానికి అనుమతివ్వక పోవటంతో తీవ్ర ఆవేదన చెందాడు.
‘నిన్నొదిలి… నేనెక్కడికీ వెళ్లలేను పేటర్ మై లవ్ ’ అన్నట్లు . కళ్ల ముందు అరబెల్లా ముఖం ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంటే తన నుంచి అరబెల్లాను ఎవరూ తీసుకెళ్లలేరనే మొండితనం ఆవరించిన . పీటర్ బందరు లో ఓ మారుమూల డచ్ వారి ఆధీనంలో ఉన్న ఓ ఖాళీ ప్రాంతాన్ని ( ప్రస్తుతం ఆనందపేటగా పిలుస్తున్నారు) తనకివ్వాలని వారిని అభ్యర్ధించాడు. ఆంగ్లేయులకు నాడు బద్ధ శత్రువులైన డచ్ అధికారులు తొలుత నిరాకరించినా. అరబెల్లా- పీటర్ల విషాద ప్రేమకు చలింప చేసింది. వెంటనే తమ ఆధీనంలో ఉన్న పన్నెండెకరాలకు పైగా ఉన్న స్థలాన్ని జాన్ పీటర్ కు విక్రయించారు.
దీంతో కఠిన మతపెద్దలు మతపరమైన ప్రార్థనలేవీ చేయకున్నా, తనకు వచ్చిన ప్రార్ధనలతోనే అరబెల్లాను (ప్రస్తుతం ఉన్న సెయింట్ మేరీస్ చర్చిలోపల) ఖననం చేశాడు. తనకోసం వచ్చి మరణించిన ఆరబెల్లా కోసం ఇంకా ఏదయినా చేయాలన్న భావన జాన్ పీటర్ మనసును నిత్యం వెంటాడేది. ఏం చేయాలి, ఎలా చేయాలని అని అనేక పర్యాయాలు ఆలోచించి, దానికి ఒక రూపు తీసుకువచ్చాడు. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి సెలవు పెట్టి లండన్‌కు వెళ్లి, . అక్కడ తనకున్న ఆస్తులను అమ్మేసి ఆ డబ్బుతో ఇండియాకి తిరిగి వచ్చాడు.
తన ప్రేయసిని ఖననం చేసిన ప్రదేశంలో అప్పటిలో 18 వేల రూపాయలను వెచ్చించి అరబెల్లా స్మారకార్థం ఒక చర్చిని నిర్మించాడు. చర్చ్‌ని నిర్మించేటప్పుడే భూమి ముంచి ఎప్పుడు కావాలంలే అప్పుడు గాజు పెట్టె పైకి వచ్చేటట్లు ఏర్పాటు చేశాడు. అది ఎలా ఉండేదంటే… పది అడుగుల ఎత్తులో గోడకు ఒక చెక్కతో తయారుచేసిన ఒక పావురం బొమ్మని అమర్చారు. ఆ చెక్క పావురాన్ని పట్టుకుని తిప్పితే నేలపై ఉన్న సమాధి గాజు శవపేటిక భూమి నుంచి కింద ఉన్న అమరిక మొత్తం పైకి లేలేచేలా సాగిన ఈ చర్చి నిర్మాణం 1815లో పూర్తయింది.
అప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం బందరుకోటలోతను ఉద్యోగ విధులకు వెళ్లేముందు గుర్రంపై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్చ్‌కి వచ్చి అరబెల్లాను చూసేవాడు, అలాగే ఉద్యోగ విధులు ముగిసిన తర్వాత సాయంత్రం మరోమారు ఆమె సమాధి వద్దకు వచ్చి నిచ్చెన వేసుకుని చెక్క పావురాన్ని తిప్పి, గాజు పెట్టెలో ఉన్న అరబెల్లాను కళ్లార్పకుండా చూసుకుని, తిరిగి గాజు పేటికను మూసేసి వెళ్లేవాడు. అలా కొన్నేళ్లపాటు ఇదే ప్రధానమైన దిన చర్యగా మారింది.
ఈలోగా జాన్ పీటర్ ని చెన్నైకి బదిలీ చేస్తు బ్రిటీష్ సర్కారు నిర్ణయం తీసుకుది. చెన్నైలో ఉద్యోగం చేస్తూ నెలకోసారి బందరు వచ్చి అరబెల్లాను తనివితీరా చూసుకుని గుండెలవిసేలా రోదించేవాడు. అయితే అరబెల్లా కనిపించని చెన్నై నగరంలో ప్యాటర్ ఎక్కువ కాలం జీవించలేకపోయాడు.1817లో తుదిశ్వాస వదిలాడు. అరబెల్లా జ్ఞాపకాలతోనే జీవించిన జాన్ పీటర్ ను చెన్నై నగరం తన గుండెల్లో జ్ఞాపకంగా దాచుకుంది. చెన్నైలో నేటికీ ఉన్న ఆయన పేరున ఒక పార్కు, ఒక రోడ్డు ఉన్నాయి.
జాన్ పీటర్ చెన్నైకి బదిలీ అయి వెళ్లేటప్పుడే ఈ చర్చిను ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వాధీనం చేసుకోమని కోరాడు. అయితే పీటర్ మరణానంతరం నాడు ప్రేమను దారుణంగా అణిచివేసిన నాటి మతపెద్దల వారసులు చర్చిని స్వాధీనం చేసుకొని. 1842లో ఆ చర్చ్‌కు సెయింట్ మేరీస్ చర్చ్‌గా పేరు మార్చేసారు. నాటి నుంచి ఇక్కడ మతాచారం ప్రకారం ప్రార్ధనలనూ ఆరంభించింది.
మచిలీపట్నం వెళ్లిన వాళ్లకు అరబెల్లా చర్చ్ (సెయింట్ మేరీస్ చర్చ్) కనిపిస్తుంది,పీటర్ అమర్చిన పావురం బొమ్మ ఉన్న గోడ కనిపిస్తుంది. దాని మీద అరబెల్లా కోసం రాసిన పాలరాతి ఫలకం కనిపిస్తుంది. ఆమెను ఖననం చేసిన చోటు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరబెల్లా కనిపించదు.
1960 దశకంలో చర్చ్ రంగులువేస్తున్న క్రమంలో ఆసరా కోసం ఓ పనివాడు చెక్క పావురాన్ని పట్టుకొవటంతో అది అటు ఇటుగా కదిలింది. ఆ పావురాన్ని తిప్పితే శవపేటిక పైకి వస్తుందనే సంగతి తెలియని ఆ కార్మికుడు ఆ పావురం బొమ్మను తిప్పగానే అరబెల్లా ఉన్న గాజు పెట్టె సమాధి ఒక్కసారిగా పైకి లేవటం ఇది చూసిన ఆ కార్మికుడు భయంతో అక్కడికక్కడే గుండె ఆగి చనిపోవటం జరిగాయి. దాంతో ప్పటి కలెక్టర్ ఆ ఫలకాన్ని శాశ్వతంగా మూయించారు.
! ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమించే మనసు… మనసునే కోరుకుంటుంది. మనిషి లేకపోయినా ప్రేమను పంచుతుంది మనసు. ప్రేమించే మనిషి కోసం సర్వం అర్పిస్తుంది ప్రేమ. అరబెల్లా – జాన్ ప్యాటర్ల ప్రేమ అలాంటిదే. మచిలీపట్నం – చెన్నపట్నం ఈ అమర ప్రేమికుల ప్రేమకు మౌనసాక్ష్యాలు.గా ఇవి నిలుస్తున్నాయి.