రాబిన్ హుడ్ పాత్రలో పవన్ : రీ ఎంట్రీ రెండు సినిమాలతోనట

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ దాదాపు ఖరారైపోయిందన్న వార్త గత కొంతకాలంగా వినిపిస్తూ వస్తోంది ఇప్పటికే దిల్ రాజు నేతృత్వంలో రూపొందే హిందీ సినిమా ‘పింక్’ రిమేక్‌లో ఆయన నటించేందుకు పవన్ సిద్దం కాగా ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని పరిశ్రమవర్గాలు చెపుతున్న మాట.
కాగా స్టార్ డైరెక్టర్ క్రిష్‌తో నూ మరో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నలిచ్చినట్టు సమాచారం. భారతావనికి స్వాతంత్ర్యం రాక ముందు కాలంలో ఓ రాబిన్ హుడ్ ఓ పేదలకు సాయపడేలా సాగే పాత్రలో పవన్ నటిస్తాడని సమాచారం. ఇందులో పవన్ ఇమేజ్‌తో పాటు రాజకీయ నేపధ్యం కూడా ఉండేలా డైరెక్టర్ క్రిష్ సినిమా కథను తయారు చేశాడని ఈ సినిమాను పవన్‌తో ఖుషీలాంటి సూపర్ హిట్ ఇచ్చిన ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుండటంతో పవన్ ఎంట్రీ ఈ రెండు సినిమాలతోనూ ఉంటుందని, కాల్షిట్లకి ఇబ్బంది కలగని తీరుగా త్వరత్వరగా ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నాడని సమాచారం.