ఖమ్మంలో ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

-నిందుతుల నుంచి నలబై మూడు లక్షల ఆరువై ఆరు వేల రూపాయల  విలువ చేసే చోరి సొత్తు స్వాధీనం.*  (1Kg.40 గ్రాముల బంగారం , 09  కేజీల 692గ్రాముల వెండి ఆభరణాలు , (01) లాప్ ట్యాప్,(01) Sony OLED TV “55” inch. స్వాధీనం.)

-చోరి కేసును చేధించిన ఖమ్మం  సీసీఎస్, ఖమ్మం వన్ టౌన్  పోలీసులు ..*
-ఇద్దరు నిందుతులను అరెస్ట్ చేసి  రిమాండ్ కు తరలించిన ఖమ్మం వన్ టౌన్ పోలీసులు…*

-మీడియా సమావేశంలో
కేసుల వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్*
——————————-

విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం 7:00  సమయంలో  నగరంలోని కమన్ బజర్ ,రావి చెట్టు  వద్ద సీసీఎస్, ఖమ్మం వన్ టౌన్  పోలీసులు ..
వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల  కదలికలు అనుమానాస్పదంగా  కన్పించడంతో 
అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..
పోలీసుల విచారణలో జిల్లాలో పలు చోరీలకు పాల్పడినట్లు పంచుల సమక్షంలో  నిందుతులు ఆంగీకరించారని పోలీస్ కమిషనర్ తెలిపారు.

నిందుతుల వివరాలు
 17 చోరిసోత్తు  కేసుల్లో  ప్రధాన  నిందుతుడు …
1) నదింపల్లి వెంకట వినయ్ 35yrs. గాయత్రి నగర్ ,
అయ్యప్ప కాలనీ,
దామ్మయిగూడ, హైదరాబాదు.

2) ద్వారంపూడి వేంకటేశ్వర రెడ్డి 28yrs.రావులపాలెం,
కొమరాజులంక, తూర్పు గోదావరి జిల్లా.

మొత్తం  తొమ్మిది చోరి కేసుల్లో చోరి కేసుల్లో చోరి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు  వివరించారు.  ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  సుగ్గల వారి తోట, పాకబండ బజర్, ముస్తఫానగర్ ప్రాంతాలలో  మూడు చోట్ల, రచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధో రెండు చోట్ల , కర్ణాటక రాష్ట్ర హూబ్లీలో నాలుగు చోట్ల చోరి చేసినట్లు తెలిపారు.

ఖమ్మంతో పాటు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ , రాజమండ్రి , దవళేశ్వరం, కర్ణాటక రాష్ట్రంలోని విజయాపూరి, మహారాష్ట్ర లోని బీడ్ మరియు రావురి పోలీస్ స్టేషన్లలో పలు చోరి కేసుల్లో నిందుతులుగా వున్నట్లు తెలిపారు.

చోరి కేసులను చేధించిన పోలీస్ సిబ్బందికి ప్రసంశ పత్రాలు  అందజేశారు. వారిలో….
CI CCS రవి, సార్వయ్య,  వన్ టౌన్ సిఐ రమేష్  ASI కృష్ణరావు,హెడ్ కానిస్టేబుళ్లు లతీఫ్, కానిస్టేబుల్ మంగిత్యా, గోడి హరీష్ , నాగేశ్వరరావు , రామకృష్ణ,గజేందర్, సుధాకర్  వున్నారు.

మీడియా సమావేశంలో అడిషనల్ డీసిపి లా& ఆర్డర్ మురళీధర్, అడిషనల్ డీసిపి ఆడ్మీన్ ఇంజరాపు పుాజ,   CCS ACP జహాంగీర్ , టౌన్ ఏసిపి గణేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.