మంచు విష్ణు స్కాం మోసగాళ్లు ఎవరనేది తెలియాలి…?

శనివారం మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీకి `మోసగాళ్లు` అనే టైటిల్ ఖరారు చేసి సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో మంచు విష్ణు అర్జున్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో మంచు విష్ణు డిఫరెంట్‌గా అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఐటీ రంగంలో జరిగిన ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సినిమా నిర్మితమవుతోంది.
జెఫ్రీ గి చిన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రుహానీ సింగ్ సహా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విరానికా మంచు నిర్మాత. థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్లో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 2020 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
స్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన మంచు విష్ణు స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయాడు. కామెడీ సినిమాలతో ఒకటిరెండు హిట్లు సాధించిన కెరీర్‌ను టర్న్ చేసే స్థాయి సూపర్ హిట్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు మంచు విష్ణు. కొంత కాలంగా బిజినెస్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ యంగ్ హీరో త్వరలో క్రాస్ ఓవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక మరి ఈ చిత్రం ఆయనకు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో వేచి చూడాలి.