వెంకీ మామ మాత్ర‌మే కాదు బాబాయ్ కూడా

వెంకటేష్‌, నాగచైతన్యల కాంబోలో బాబీ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మాణంలో రూపొందబోతున్న చిత్రం ‘వెంకీ మామ’. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల చివర్లో ప్రారంభం కాబోతుంది. షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి సమ్మర్‌ చివర్లోనే సినిమాను విడుదల చేయాలనేది చిత్ర యూనిట్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. వెంకీ తాజాగా ఎఫ్‌ 2 చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వెంకీ తన సినిమాతో ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేశారు. అందుకే వెంకీ మామ కూడా అలాగే ఉండాలని బాబీ భావిస్తున్నారు.

మరో వైపు ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్‌ను పెంచేందుకు మరో హీరోను కూడా ఇన్వాల్వ్‌ చేయాలని సురేష్‌బాబు భావిస్తున్నారు. ఆ హీరో మరెవ్వరో కాదు రానానే. అవును నిజంగానే ఈ చిత్రంలో రానా ఒక కీలక పాత్రలో కనిపిస్తాడని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రానా గెస్ట్‌ పాత్రలో ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తే ప్రేక్షకులు విపరీతంగా ఈ చిత్రంపై ఆధరణ కురిపించే అవకాశం ఉందనేది సురేష్‌బాబు ప్లాన్‌. అందుకే ఈ చిత్రంలో సురేష్‌బాబు పట్టుబట్టించి రానాతో నటింపజేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయినా కూడా కావాలని ఇంకా రానా పాత్రను పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

నాగచైతన్య కంటే ముందు వెంకటేష్‌ తన అన్న కొడుకు రానాతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఎప్పటి నుండో ఆ సినిమాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. కాని కథ సరిగా సెట్‌ అవ్వక పోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు బాబాయి సినిమాలో అబ్బాయి రానాను కూడా నటింపజేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 20 నుండి 30 నిమిషాల వరకు రానా ‘వెంకీ మామ’ చిత్రంలో ఉంటాడని, వెంకీ మరియు రానాల కాంబోలో వచ్చే సీన్స్‌ బాగుంటాయని అంటున్నారు. వెంకీ, రానాలు ఈ చిత్రంలో బాబాయి, అబ్బాయిగానే కనిపిస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.