గోడ మీద వార్తలు

     

                                    

01 . పోలవరం నిర్మాణం పూర్తయితే తమకి తీవ్ర నష్టం జరుగుతుందని – కాబట్టి వెంటనే ఆ నిర్మాణం ఆపేయాలని సుప్రీం ను కోరిన – ఒడిషా …
ఆల్రెడీ ఆపేసిన పనులని ఆపేయాలంటూ పిటిషనేంట్రా సామీ – మీకు పేపర్లు రంధ్రం కాపోతే…!!
02. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ తిరుగులేని మెజారిటీ సంపాదిస్తుందంటూ ఎగ్జిట్ పోల్ సర్వేలు …
ఆరేళ్ళ క్రితం అన్నియ్యనీ – ఏడాది క్రితం బాబోరిని నమ్మించి నాకించేసింది ఈ నిష్క్రమణ ఎన్పికలే కదూ …!! 
03. కియా సంస్థ పక్క స్టేటు కి పోతోందని తాము అచ్చేసిన వార్త తప్పంటూ మరో వార్తేసిన – రాయిటర్స్ …
ఇమేజు సంకనాకిపోయాక సవరణలేయటం ఏందిరా సామీ – వెంకటేషు మంచోడని చంద్ర మోహను మరో ఉత్తరం రాస్తానన్నట్టుంది …!!
04. రాష్ట్రంలో మరో పార్టీ ఎదగకుండా చేసేందుకు వైకాపా తెదేపాల రహస్య ఒప్పందం చేస్కున్నాయి – ఐవీఆర్ కృష్ణారావు …
అంటే – ఏపిలో ఇపరీతంగా ఫాలోయింగున్న భాజపాని – మా ఈర్రాజు మాయ్యనీ తొక్కేస్తన్నది భాజపా కాదూ – తెదేపా వైకాపాలనా శ్లేష…??
05. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలని మూసి వేసే ఆలోచనలో కేంద్రం – ఆల్రెడీ నోటీసులు పంపినట్టు బోగట్టా …
ఏ రాజు గారి బావమరిదో కొత్త పత్తేపారం మొదలెడతన్నట్టున్నాడు – మిగిల్నేపారాలు మూసీపోతే ఎట్టామరి..??
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 
:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.