‘అల’ అరుదైన రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకంత్వంలో వచ్చిన ‘అల..వైకుంఠపురములో’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాటి నుంచి రికార్డులతో పాటు కలెక్షన్లలోనూ అగ్రగామిగా నిలుస్తోంది. తాజాగా యూఎస్‌లో వీకెండ్లో ‘అల’ కలెక్షన్లతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. హాలీవుడ్ సినిమాలను పక్కకు నెట్టి ఏకంగా $1.43 మిలియన్లు వసూలు చేసి, అత్యధిక కలెక్షన్ల సాధించిన 10 సినిమాల్లో ‘అల..వైకుంఠపురములో’ అగ్రస్థానంలో నిలిచి అరుదైన రికార్డ్ సృష్టించింది.
కాగా కలెక్షన్లలో టాప్ 10గా నిలుస్తున్న సినిమాల్లో అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, దర్బార్, చపాక్, తానాజీ ఐదు భారతీయ చిత్రాలు ఉండటం కూడా మరో రికార్టే కావటం విశేషం. ఇప్పటికే సంక్రాంతి విన్నర్ గా దర్శకనిర్మాతలు చెప్పుకుంటున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలోనూ పలు చిత్రాలకు ఎదురు నిలచి కలెక్షన్ల సునామి సృష్టించడం పట్ల బన్నీ అభిమానులలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.