జోలిపట్టి కాలినడకన తిరుగుతూ..

అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల హోరు జోరు అందుకుంది..ఇందులో భాగంగానే మచిలీపట్నంలో చంద్రబాబునాయుడు కాలినడకన వీధుల్లో తిరిగారు. జనం తండోపతండాలుగా వచ్చారు. అమరావతి రాజధాని మార్చవద్దని జనం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు జోలిపట్టి ఉద్యమానికి విరాళాలు సేకరించారు.. అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారు ఈ ఉద్యమంలో పాల్గొనడం విశేషం.. ఇందులో సిపిఐ నేతలు, విద్యార్థులు,మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని పై ఉద్యమం ఉధృతం కాగలదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్టు అనిపిస్తుంది అని కూడా మేధావుల అభిప్రాయం. గత 20 రోజులుగా ఇంత జరుగుతున్నా కూడా జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇప్పటికే సెక్రటేరియట్ లో ఉన్న 30 శాఖలకు విశాఖ తరలి పోవాలంటూ మౌఖిక ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం..చిలికి చిలికి గాలివానగా మారుతుందా లేక ఆగిపోతుందా అనేది చూడాలి…