ముగ్గురు హీరోల‌కి హిట్ ఇచ్చిన హీరోయిన్ ఈమెనా…?

అక్కినేని హీరో సుమంత్ కథానాయకుడుగా నటించిన యువకుడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది నటి భూమిక చావ్లా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ బాబు ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరవాత నటించిన సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించలేకపోయాయి. ఇక శివాజీ హీరోగా వచ్చిన మిస్సమ్మ సినిమాకి గాను నంది అవార్డుని దక్కించుకుంది. ఇక 2007 లో వివాహం చేసుకొని సినిమాలకి దూరంగా ఉన్న భూమిక మళ్లీ లడ్డుబాబు సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత ఎంసిఎ, యు టర్న్, సవ్యసాచి, రూలర్ సినిమాల్లో నటించింది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది.

పవన్ ఖుషి , మహేష్ ఒక్కడు , ఎన్టీఆర్ సింహాద్రి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది భూమిక. ఈ సినిమాలు ఆ హీరోలో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఎంటటే ఈ ముగ్గురు హీరోలకు అవి ఏడోవ చిత్రం కావడం విశేషం. అయితే ఈ భామ  ఇప్ప‌టికీ త‌ను గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నాన‌ని చెబుతుంది భూమిక‌. ఈమె అడ‌గ‌డం వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఈమెను గ్లామ‌ర్ షో చేయించే ఆలోచ‌న ఇప్పుడు ఏ ద‌ర్శ‌కుడు చేస్తాడు అనేది అస‌లు ప్ర‌శ్న‌.


Leave a Reply

Your email address will not be published.