మహానాయకుడులో ఆ సీన్లు ఉండవట

భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం ‘మహానాయకుడు’ పైనే ఆశలన్నీ పెట్టుకుంది. అయితే మహానాయకుడు ఎన్టీఆర్ చివర దశ వరకూ చూపించరని, కేవలం ఎన్టీఆర్ రెండోసారి సీఎం అయ్యినంత వరకు మాత్రమే మహానాయకుడు ఉండబోతుందని తెలుస్తోంది.
అయితే ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో రెండు కీలక వివాదాలు ఉన్నాయి. వాటిలో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ఒకటి కాగా, ఎన్టీఆర్ ను విభేదించి చంద్రబాబు చేసిన తిరుగుబాటు మరొకటి. అయితే ఈ రెండు వివాదాల్లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు మాత్రమే మహానాయకుడు చూపించబోతున్నారు.
ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ తో పాటు, వారాహి ప్రొడక్షన్స్ మరియు విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు