రేణు రీ ఎంట్రీ

రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సైలెంట్ అయిపోయింది.
ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్.
  పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ సినిమాల్లో రీ ఎంట్రీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ మూవీతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ, తెలుగు సినిమా, పవన్ కల్యాణ్, రేణు దేశాయ్.

తాజాగా రేణు దేశాయ్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాను ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రేణు దేశాయ్..బెల్లంకొండ శ్రీనివాస్‌కు అక్కపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాతో నటిగా రేణు దేశాయ్ రీ ఎంట్రీ అనే వార్త ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published.