టీడీపీ ఎంఎల్ఏ లు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి … కొడాలి సవాల్

అమరావతియే రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని మీరనుకుంటే మీ 21మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేసారు ఏపీ మంత్రి కొడాలి నాని. సోమవారం ఆయన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం వేదికగా అమరావతి రాజధాని అంశంపై జరిగిన చర్చపై ఆయన మాట్లాడుతూ, విపక్ష నేత చంద్రబాబుకు అసలు రాష్ట్రం మీద అవగాహనే లేదని ఎద్దేవా చేసారు. చంద్రబాబు మాయలో ఉన్న కొందరు మాత్రమే రాజధాని అంటూ గగ్గోలు పెడుతున్నారు మినహా రాష్ట్రమంతా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
రాజధాని విషయంలో రైతులకు, మహిళలకు అనుమానాలుంటే.. నేరుగా జగన్ను వచ్చి కలవాలని ఎంతో పెద్ద మనసున్న జగన్ తప్పకుండా మీ కష్టాల్ని విని మీకు న్యాయం చేస్తారు’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్లా చనిపోయినా బతికున్న వ్యక్తని… ఆయనది చాలా గొప్ప మరణమని నాకు ఆ మరణమే కావాలని దేవుడ్ని కోరుతాను’ అనివ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కొంతమంది జగన్ కుటుంబాన్ని, ఆయన తండ్రిని విమర్శించడం సరికాదని మండిపడుతూ… ప్రజల మనసులలో చోటున్న వైఎస్ఆర్ పేరుమీద జగన్ పార్టీ స్థాపిస్తే… కడప జిల్లాలో ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేసిన ఘనత జగన్ దేనని, రాజశేఖర్ రెడ్డి మరణంపై విమర్శలు చేస్తున్నవారు సన్నాసులు. అని అన్నారు.