*కేంద్ర రెవెన్యూ లోటు బడ్జెట్ ప్రభావం నుండి రాష్ట్రాలను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు*


రాంనారాయణ 
ఖమ్మం 

పార్లమెంట్ లో ఆర్దిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ గారిని ప్రశ్నించిన TRS లోక్ సభపక్ష నేత నామ నాగేశ్వరరావు గారు.
✍ TaxationLaw (సవరణ)బిల్లు – 2019 పై లోక్ సభలో చర్చ జరిగిన సందర్భంలో TRS లోక్ సభపక్ష నేత,ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఒక లక్ష నలబై ఐదు కోట్ల రెవెన్యూ లోటు ఉండుట వలన ఇది రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తుందని, అందువలన రాష్ట్రాలను ఆదుకోవటానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ గారిని ప్రశ్నించారు.ఇప్పటికే  4.8% ఉన్న జీడీపీ ని రెండు అంకెలు వృద్ధి కి తీసుకుంటున్న చర్యలు, సమయం తెలపాలని కోరారు.
👉 నామ నాగేశ్వరరావు గారి ప్రశ్నకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ గారు సమాధానం ఇస్తూ…నామ గారికి భరోసా ఇవ్వాలి అనుకుంటున్నాను. రాబోయే ఏడాది కాలంలో మరెన్నీ పెట్టుబడులు భారత దేశంలో వస్తాయి అని తద్వారా ఉద్యోగాల కల్పన జరగటం తో పాటుగా భారత దేశం తయారీ కేంద్రం అవటం తో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.