ల‌వ్‌గేమ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌

త‌మిళంలో 50రోజులు దిగ్విజ‌యం సాధించిన సూప‌ర్‌హిట్ చిత్రం ల‌వ్‌గేమ్. ధ‌ను క్రియేష‌న్స్ వారి బ్యాన‌ర్ పై భువ‌న్ కుమార్ అల్లం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త‌మిళం నుండి తెలుగులోనికి డ‌బ్బింగ్ చేసి మార్చి 8న తెలుగు రాష్ర్టాల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌ముఖ న‌టుడు భాగ్య‌రాజ్‌గారి త‌న‌యుడు శంతాను భాగ్య‌రాజ్, శృష్టి క‌థానాయ‌కులుగా న‌టించ‌నున్నారు.ఈ చిత్రం డ‌బ్బింగ్ పనుల‌న్నీ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న  సంద‌ర్భంగా శ‌నివారం ద‌స్‌ప‌ల్లాహోట‌ల్లో ఈచిత్ర  ఆడియోను విడుద‌ల చేసి విలేక‌రుల స‌మావేశంలో…

అనిల్‌రావిపూడి మాట్లాడుతూ… ఈ టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్ ఇది సెంధిల్ 8వ చిత్రం. భాగ్య‌రాజ్‌గారు నా ఎఫ్‌2 చిత్రం చూసి ప్ర‌తీ డైలాగ్ గుర్తుంచుకుని ఆయ‌న నాకు ఫోన్ చేసి మ‌రీ మాట్లాడారు. ఫ్యామిలీ మూవీస్ చెయ్య‌డంలో భాగ్య‌రాజ్‌గారి త‌ర్వాతే ఎవ‌రైనా నేను ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్ ని ఆయ‌న‌తో నేను ఇక్క‌డ ఉండ‌టం నా అదృష్టం అన్నారు.

క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ… సినిమా అంటేనే నేను భాగ్య‌రాజ్‌గారిని చూసి ఇన్సైర్ అయ్యాను. ఆయ‌న సినిమా త‌మిళంలో హిట్ అయింది ఇక్క‌డ కూడా మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను ఈ టీమ్ అంద‌రికి ఆల్ ద బెస్ట్ అన్నారు.

చంద్ర‌మ‌హేష్ మాట్లాడుతూ… ముందుగా ఈ ల‌వ్‌గేమ్ ప్రొడ్యూస‌ర్‌కి నా శుభాకాంక్ష‌లు. నేను భాగ్య‌రాజ్‌గారికి ఏక‌ల‌వ్య‌శిష్యుడ్ని. నేను అప్ప‌ట్లో ఒక డైరెక్ట‌ర్ ఇల్లు చూశాను అంటే అది భాగ్య‌రాజ్‌గారి ఇల్లే. వీళ్ళ అబ్బాయితో నేను సినిమా చెయ్య‌లేక‌పోవ‌డం నా దుర‌దృష్టం. కాని నా స్నేహితుడు ఈ సినిమా చేస్తున్నారు చాలా సంతోషం. సెంథిల్ చాలా అద్భుత‌మైన ఆర్టిస్ట్ ఈ చిత్రం త‌ప్ప‌కుండా మంచి హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ తిరు మాట్లాడుతూ… ఈ సినిమా త‌మిళ్‌లో హిట్ అయిన‌ట్లే ఇక్క‌డ కూడా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అన్నారు.

హీరో సెంథిల్ మాట్లాడుతూ… 30ఏళ్ళ నుంచి మా నాన్న‌గారిని ఆద‌రిస్తున్నారు. అదే ఆద‌ర‌ణ నాకు కూడా ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా తెలుగు ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌యం అవుతున్నాను. ఈ సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది. అది అంద‌రికీ అనెక్ట్ అవుతుంది. ఆడియ‌న్స్ అంద‌రికీ చాలా బాగా న‌చ్చుతుంది. ప్లీజ్ స‌పోర్ట్ అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ అల్ల‌మ్ భువ‌న్ కుమార్ మాట్లాడుతూ… ఈ టీమ్ అంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు నేను 20 సినిమాలు చూశాను. అందులో ఈ సినిమా బాగా న‌చ్చింది. వెంట‌నే రైట‌ర్ వెన్నెల‌కంటిగారిని చూడ‌మ‌న్నా ఆయ‌న ఈ సినిమాని ఎంతో మెచ్చుకున్నారు. మీరు ఈ సినిమాకి నాకు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు నేను చేస్తాను అన్నారు. దాంతో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ సినిమా త‌ప్ప‌కుండా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను అన్నారు.

భాగ్య‌రాజ్ మాట్లాడ‌తూ…మా అబ్బాయి న‌టించిన ల‌వ్ గేమ్ చిత్రం అంద‌రూ పెద్ద మ‌న‌సుతో హిట్ చేశారు. డెఫ్‌నెట్‌గా ఇక్క‌డ కూడా హిట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను. నా డబ్బింగ్ చిత్రాల‌న్నీ ఇక్క‌డ సూప‌ర్‌హిట్లు అయ్యాయి. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి అని అన్నారు.

ర‌మ్య‌కృష్ణ మాట్లాడుతూ… భాగ్య‌రాజ్‌గారి తెలుగు చాలా బావుంది. ఇండియాలోనే జీనియ‌స్ డైరెక్ట‌ర్‌. సెంథిల్ ప్ర‌స్తుతం ఉన్న యంగ్ జ‌న‌రేష‌న్‌లో చాలా టాలెంట్ ఉన్న వ్య‌క్తి. ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

తేజ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ… నేను భాగ్య‌రాజ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని నేను చ‌దువుకునే రోజుల్లో ఆయ‌న సినిమాల‌న్నీ చూసేవాడ్నివాళ్ళ అబ్బాయి మూవీఇక్క‌డ రిలీజ్ అయి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

రాజశేఖ‌ర్ మాట్లాడుతూ… భాగ్య‌రాజ్‌గారు చాలా మంచి స్ర్కీన్‌ప్లే డైరెక్ట‌ర్‌. వాళ్ళ అబ్బాయి అంటే ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు పులి బిడ్డ‌. త‌ప్ప‌కుండా ల‌వ్‌గేమ్ పెద్ద హిట్ అవుతుంది.

జీవిత‌రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ… తేజ నేను క్లాస్‌మేట్స్‌త‌ను ఎలా ఆయ‌న మూవీస్ చూసి ఇష్ట‌ప‌డ్డాడో నేను అంతే. మేము వాళ్ళ అబ్బాయి ఫంక్ష‌న్‌కి రావ‌డం చాలా సంతోషంగా ఉంది ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ మా స్పెష‌ల్ విషెస్ అన్నారు. ముఖ్యంగా ర‌మ్య గురించి చెప్పాలంటే త‌ను ఏ మూవీలో న‌టిస్తే అది హిట్‌ అవుతుంది. ఈ సినిమా కూడా అదే విధంగా హిట్ అవుద్ది అన్నారు.

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ… భాగ్య‌రాజ్‌గారు చాలా పెద్ద వారు. వాళ్ళ అబ్బాయి సెంథిల్ నాకు మంచి ఫ్రెండ్. ఎదుటి వాళ్ళ‌కి ఎంతో హెల్ప్ చేసే గుణ‌ముంది. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే త‌ను నాకు చాలా స‌హాయ‌ప‌డ్డాడు. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కులు చంద్ర‌మ‌హేష్‌, తేజ‌, ప్ర‌ముఖ న‌టీమ‌ణి ర‌మ్య‌కృష్ణ‌, హీరో సందీప్‌కిష్‌, జీవిత‌రాజ‌శేఖ‌ర్‌, అనిల్‌రావిపూడి, త‌దిత‌రులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published.