*ఇంటింటికి తిరిగి చెక్కులు అందజేసిన మంత్రి..*

రాంనారాయణ 
ఖమ్మం 
◆ కార్పొరేషన్ పరిధిలో మేయర్ తో కలిసి 83 చెక్కులకు గాను రూ.82.60 లక్షల చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందజేత
◆  మంత్రి అయినా ఇంటింటికి ఇచ్చే పాత పద్ధతినే కొనసాగింపు
◆ నగర వీధుల్లో ద్విచక్ర వాహనాలపై మంత్రి సందడి.. 
◆ హుషారుగా పెద్ద ఎత్తున పాల్గొన్న తెరాస శ్రేణులు
ఖమ్మం కార్పొరేషన్ పరిధి మంజూరైన షాదిముభారక్ చెక్కులను మేయర్ పాపాలాల్ గారితో కలిసి రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మోటార్ సైకిల్ మీద వెళ్లి ఇంటింటికి తిరిగి ఆయా చెక్కులను పంపిణీ చేశారు. 83 చెక్కులను గాను రూ. 82.60 లక్షల విలువ గల చెక్కులను వారు పంపిణీ చేయనున్నారు.  11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 28, 29, 30 డివిజన్లలో చెక్కులు పంపిణీ చేశారు.
సాయంత్రం 4 గంటల నుండి 8, 9, 22, 6, 5, 4, 3, 2, 27, 33, 35, 48, 47, 45, 42, 41, 40, 39, 38వ డివిజన్లలో చెక్కులను పంపిణీ చేస్తారు. స్థానిక నాయకులు కార్యకర్తల నడుమ వాహనాలపై పుర వీధులలో మంత్రివర్యుల పర్యటనతో ప్రజలు హారతులు పట్టారు. ఆయన ఆలోచన విధానానికి జై కొడుతున్నారు. చెక్కుతో పాటు చీర, పళ్ళు స్వయంగా ఇంటికే తీసుకొచ్చి ఇవ్వడంతో వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరిసాయి. మాకోసం కూడా ఆలోచించదానికి పెద్ద దిక్కు ఉన్నారని సంబర పడుతున్నారు. మంత్రి అజయ్ గారికి మిఠాయిలు తినిపించి తమ ఇంటి పెద్దకొడుకుగా ఇంటికే చెక్కు తేవడం పట్ల కృతజ్ఞతా భావంతో తమ హృదయానికి హత్తుకుంటున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒకఎత్తు  అయితే, ఎక్కడ జరగని రీతిలో వాటిని ఇంటికే తెచ్చి ఇవ్వడం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అజయ్ గారికి సర్వదా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రతి పేద ఇంటికి సంకేమ పథకాలు అందాలని వారి కుటుంబాల్లో ఆనందాలు విరజిమ్మలని ఆకాంక్షిస్తూ ఖమ్మం ప్రజలకు నెనున్నాననే భరోసాను కల్పించే విధిగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.   తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నటి నుండి ఇంటికే చెక్కులు తీసుకొచ్చి ఇవ్వడంతో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతర ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచారు. పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇదే సంస్కృతిని కొనసాగిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published.