సానియా బయోపిక్ సన్నాహాలు

అరడజను క్రీడా బయోపిక్ లు ఇప్పటికే ఆన్ సెట్స్  ఉన్నాయి. కపిల్ దేవ్, సైనా నెహ్వాల్, మిథాలిరాజ్, సింధు వంటి వారిపై సినిమాలు తీస్తున్నారు. ఈ ఒరవడిలోనే హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మిర్జా జీవితంపై సినిమా తీసేందుకు పలువురు మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దర్శకనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ ఈ బయోపిక్ పై ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఇప్పటికే ప్రచారమైంది. పైగా ఫరాఖాన్ కి సానియా ఎంతో సన్నిహితురాలు. ఆ ఇద్దరి బాండింగ్ పై ఇప్పటికే బాలీవుడ్ లో ఎంతో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముంబై వెళితే సానియా తప్పనిసరిగా ఫరాఖాన్ ని కలవకుండా తిరిగి హైదరాబాద్ కి రారు. అందుకే ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న ప్రచారం అంతకంతకు వేడెక్కిస్తోంది. ప్రస్తుతం సానియా మిర్జా ముంబై లో ఫరాఖాన్ ఇంటికి వెళ్లడం మరోసారి బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఆ ఇద్దరి కలయికకు సంబంధించి ఓ వీడియోని ప్రఖ్యాత బాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఫరాఖాన్, సానియా ఈ ఇద్దరూ వీడియోలో పూర్తి చిలౌట్ తో కనిపిస్తున్నారు. “సానియా బయోపిక్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాం.. ఫరా ఖాన్ మాత్రమే ఈ బయోపిక్ కి న్యాయం చేయగలరు” అంటూ వైరల్ భయానీ ఇన్ స్టాలో కామెంట్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనర్థం.. సాధ్యమైనంత తొందరలోనే సానియా బయోపిక్ సెట్స్ పైకి వెళుతోందనే..! ప్రస్తుతం ఆ పనిలోనే ఫరాఖాన్ బిజీగా ఉన్నారని అర్థమవుతోంది. మరోవైపు సానియా మిర్జా ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ని మహేష్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో జరుపుకున్న సానియా.. ఆ తర్వాత పలుమార్లు ముంబై విమానాశ్రయంలో ప్రత్యక్షమవ్వడం పై ఆసక్తికర చర్చ సాగింది. రెగ్యులర్ గా డైరెక్టర్  ఫరాఖాన్ ని కలిసేది ఇందుకేనా? అంటూ ఇప్పుడు మరోసారి బయోపిక్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలీవుడ్ సెలబ్రిటీల్ని కలవాలన్న ఆసక్తి సానియాలో ఎందుకు? అంటూ మరోవైపు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో డిబేట్ కి తెర తీశారు

Leave a Reply

Your email address will not be published.