రామోజీ ఫిలిం సిటీ లో టీడీపీ రహస్య సమావేశం…

KTR, జగన్ సమావేశంతో కలవరపడిన టీడీపీ నేతలు ఫిల్మ్ సిటీలో అత్యవసర సమావేశం నిర్వహించారని విశ్వసనీయ సమాచారం.
టీడీపీ లోని ఒక వర్గం లోని పెద్దలంతా సమావేశమై TRS , YCP లు కలిసి తమపై ఏవిధమైన కుట్రలు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారట.
అయితే టిడిపికి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కొప్పుల వెలమలను వెలమ అయిన KCR వ్యూహంతో టిడిపికి దూరం చేయడం ఖాయంగా కనబడుతోంది.
అదేవిధంగా టిడిపికి మరో బలమైన మద్దతుదారులైన యాదవులనూ టిడిపికి దూరం చేసే పనిలో TRS నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ఆంధ్రాకు వచ్చి యాదవ సమావేశాలు నిర్వహించడం తెలిసిందే.
ఇలాగే టిడిపికి మద్దతు ఇస్తున్న బిసి కులాలపై KCR సీరియస్ గా దృష్టి పెట్టినట్టు సమాచారం,
ఇప్పటికే ఆంధ్రాలో 28% జనాభాతో అతిపెద్ద సామాజికవర్గమైన కాపులు టిడిపికి బద్ధ శత్రువులుగా మారిపోయారు.
గత ఎన్నికల్లో జనసేన అథినేత పవన్ మద్దతు ఇవ్వడం వలన అథికారంలోకి వచ్చామన్న విషయం మరచిపోయి విశ్వాస ఘాతకంగా వ్యవహరించి పవన్ ను దూరం చేసుకున్నారు.
రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఉద్యమం చేసిన ముద్రగడనూ, కాపు యువకులనూ దూషిస్తూ కేసులు పెట్టి వేధించి ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.
కాపు ఉద్యోగులనూ, కాపు అధికారులనూ విపరీతమైన వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే.
ఇన్ని సామాజికవర్గాలన్నీ దూరమవడంతో 3% శాతం ఉన్న పచ్చ సామాజికవర్గం భయానికిలోనై ఏదో ఒక రకంగా జనసేనతో పొత్తుకు ఒప్పించాలని, అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలని తీర్మానించారట.
బాబు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి అవినీతి కేసుల నుండి తప్పించుకోవచ్చనీ భావిస్తున్నారట.
సియం పదవిని జనసేనకు వదులుకోడానికీ సిద్ధపడాలని కమ్మకుల పెద్దలు నిర్ణయించారట.
పవన్ ఒప్పుకుంటే 175 MLA సీట్లలో సగం ఇచ్చి, MP సీట్లు మాత్రం ఎక్కువ పోటీ చేయాలనీ, తద్వారా బాబు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పొచ్చని తీర్మానించారట.
ఈ ప్రతిపాదనలకు పవన్ ఒప్పుకోకపోతే జనసేనకు 100 సీట్లిచ్చి TDP 75 సీట్లలో పోటీ చేయడానికైనా సిద్ధపడి అధికారంలో భాగస్వాములుగా ఉండొచ్చనీ…. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో జగన్ ను రానివ్వకూడదనీ నిర్ణయించారట.
ఇప్పటికే ఈ ప్రతిపాదనలతో జనసేన అథినేత పవన్ వద్దకు తీసుకెళ్ళారనీ….. అయితే ఆయన తిరస్కరించారని తెలుస్తోంది.
ఒంటరిగానే బరిలో దిగుతామనీ, ఒకసారి బాబును నమ్మితే నమ్మక ద్రోహం చేశాడనీ, మరోసారి మోసపోడానికి సిద్ధంగా లేమనీ పవన్ స్పష్టం చేశారట.