అప్పటి హీరో ల ఇప్పటి పరిస్థితి ఎలా ఉందంటే…

దాదాపు 25ఏళ్ళ పాటు ఆ నలుగురు హీరోలు టాలీవుడ్ ని ఓ విధంగా శాసించారు. వరుస హిట్లతో బాక్సాఫీసులకు కాసుల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్ ఇలా ఈ నలుగురూ టాప్ స్టార్స్ గా 80-90 దశకాలలో నిర్మాతలకే కాదు తెలుగు సినిమాని ఓలలాడించారు. ఊహించని తీరుగా ఎన్నో రకాల వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను మైమరిపించారు. బాక్సాఫీస్ కింగ్స్ తామేనని పోటా పోటీగా నిరూపించుకున్నదీ ఈ నలుగురే. మహేష్, ఎన్టీఆర్, పవన్ ఎదిగేవరకు హవా కొనసాగించారు. ఇప్పుడు కుర్ర హీరోలు, చిన్న చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు సీనియర్ హీరోల పరిస్థితి ఎలా ఉందంటే….
టాలీవుడ్ అగ్రహీరోగా నంబర్ వన్ పొజిషన్ ఉన్న చిరంజీవి దాదాపు దశాబ్దకాలం ఇండస్ట్రీకి దూరమై రాజకీయాలలో తల మునకలై, కేంద్ర మంత్రిగా చేసి తిరిగి ముఖానికి రంగేసుకుని ఖైదీ నెం. 150 అంటూ వచ్చి తన స్టామినా చూపించాడు. సైరా మూవీ తో పాన్ ఇండియా మూవీ చేసి మార్కెట్ అండ్ పాపులారిటీ కొంచెం కూడా తగ్గలేదని నిరూపించుకున్నాడు.
ఇక అగ్రహీరోలలో రెండో స్థానంలో ఉన్న నందమూరి బాలకృష్ణ పరిస్థితి దారుణంగా ఉంది. వరుస పరాజయాలు వేధిస్తూ వస్తున్నాయి. దీంతో దారుణంగా మార్కెట్ పడిపోవటం ఆందోళన కలిగించేదే. ఒకప్పుడు ఎన్నో హిట్స్ కొట్టిన బాలయ్య రాజకీయాలలోకి వచ్చి శాసనసభ్యుడిగా బిజీ అవుతునే సినిమాలు చేస్తున్నా… తగిన హిట్ లేక విలవిలలాడుతున్నాడు. క్రేజీగా తీసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ పెద్ద డిజాస్టర్ కావటం, వెనువెంటనే విడుదలైన రూలర్ బోల్తా కొట్టడంతో కొత్త కథలు వెతికే పనిలో పడ్డాడు. .
ఇక సినీ మన్మధుడిగా పేరున్న నాగార్జున చేస్తున్న సినిమాలు కూడా వరుస డిజాస్టర్లే…. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా కొంత పరవాలేదనిపించినా గత ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన మన్మధుడు2 ఆశించిన విజయం అందుకోక పోవటంతో వెనుక బడ్డారు. తాజాగా చేస్తున్న సినిమా మీదే ఆశలున్నాయి. అయితే అది కూడా ఎంత వరకు నిలుస్తుందన్నది ప్రశ్న.
మరో అగ్రహీరో వెంకటేష్ . వయసు రీత్యా ఓ వైపు హీరో పాత్రలు చేస్తునే వచ్చిన క్యారెక్టర్లు చేస్తూ పోతున్నాడు . బాలయ్య, నాగార్జున లతో పోల్చుకుంటేమంచి ఫార్మ్ కొనసాగిస్తున్నాడనే చెప్పాలి. గురు, దృశ్యం వంటి హిట్ చిత్రాల తదుపరి ఎఫ్ 2 సూపర్ హిట్ అయ్యి. సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. వెంకీ మామ సైతం హిట్ అందుకోవటంతో చిరు, వెంకీలు ఇంకా తమ హవా కొనసాగిస్తుండగా… ఒకప్పుడు నందమూరి, అక్కినేని కుటుంబాలే ఏలిన చిత్ర సీమలో నాగ్, బాలయ్య వెనుకబడ్డారనే చెప్పక తప్పదు.