ఎన్టీఆర్ కొత్త ప్ర‌యోగం… ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుద్దో…?

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత.. ఇలా వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో పాత రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఓ వైపు హిట్ల మీద హిట్లు కొడుతూనే తన మార్కెట్‌ను కూడా అమాంతం పెంచేసుకున్నాడు. పలు వ్యాపార ప్రకటనలు, కొన్ని ఛానళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేస్తూ బిజీ అయిపోయాడు. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో కొమురం భీం పాత్రలో తన నటనా కౌశల్యాన్ని మరోసారి ప్రదర్శించబోతున్నాడు. పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు.


ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ మాత్రం త్వరలో రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్‌ మూవీలో రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్‌ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆర్‌ఆర్ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ చేయబోయే సినిమా ఏంటన్న చర్చ అప్పుడే ఇండ‌స్ట్రీలో మొద‌లైపోయింది. కొద్ది రోజులుగా కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్‌ ఎన్టీఆర్‌కు కథ కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. వ‌రుస విజయాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌కు ఇప్పుడు ఈ ప్ర‌యోగాలు అవ‌స‌ర‌మా అంటున్నారు సినీ విశ్లేష‌కులు.తాజాగా మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆర్ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌, నిర్మాత కేయల్‌ నారాయణ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను మ్యాచ్‌ చేసే స్థాయిలో కొత్త దర్శకుడు సినిమాను రూపొందించగలడా అని చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.