ర‌వితేజ పాట సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలు పాటలు పాడటం సాధార‌ణ‌మైపోయింది. హీరోలు పాడుతున్న పాట‌లు ఆయా సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోతున్నాయి. సినిమాకు ఇదో ప్లస్ పాయింట్ కూడా అవుతున్నాయి. దీంతో హీరోల చేత పాటలు పాడించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు అన‌టంలో సందేహం లేదు. తమన్ లాంటి టాప్‌ మ్యూజిక్స్ డైరెక్టర్స్ కూడా స్టార్ హీరోలతో పాటలు పాడించి ప్ర‌యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


మాస్ మ‌హ‌రాజ్ రవితేజతో నోటంకి అనే సూప‌ర్ డూప‌ర్ హిట్‌ పాట పాడించిన తమన్ తాజాగా డిస్కో రాజాలోనూ ర‌వితేజ‌తో మ‌రోమారు గొంతు స‌వ‌రించుకునే ఛాన్సిచ్చాడు. ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు సిద్ద‌మ‌వుతుంటే… ర‌వితేజ పాట సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మంటున్నారు సినీ జ‌నాలు.

Leave a Reply

Your email address will not be published.