వార‌స‌త్వాలను మించిపోయే క్రేజ్ వీళ్ళ‌కే సొంతం


నందమూరి మూడో తరం నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా తన సత్తా చూపెడుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస హిట్లతో తన సత్తా చాటుతున్న ఏకైక నంద‌మూరి హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌. సినిమాల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్. కెరియ‌ర్ మొద‌టి నుంచి కూడా ఎవ్వ‌రి బ్యాక్ రౌండ్ లేకుండా త‌న సొంత టాలెంట్‌తో టాలీవుడ్‌లో ఒక సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నాడు. ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చినా ఎన్టీఆర్ రూపం అందిపుచ్చుకుని సీనియర్ ఎన్టీఆర్ మళ్లీ పుట్టాడు రా అన్నంత  ఫేమస్ అయ్యాడు జూనియర్. సీనియ‌ర్ ఎన్టీఆర్ పోలీక‌లు చాలా వ‌ర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు త‌న రూపంలోనే కాకుండా న‌ట‌న‌లోనూ క‌న‌ప‌డ‌తాయి. ఏ పాత్ర చేసినా ఇట్టే ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటాడు. త‌న‌దైన శైలిలో థియేట‌ర్ లో ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తాడు. ఇటు మాస్, ఆటు క్లాస్ ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల్ల ఏకైక స‌త్తా ఉన్న హీరో ఎన్టీఆర్. అయితే సినిమాల్లోనే కాక ఇటు రాజ‌కీయాల్లోనూ త‌న స‌త్తా చాటాల‌ని చాలా మంది ఆశిస్తున్నారు. కానీ ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం త‌న ఫోక‌స్ మొత్తం సినిమాల పైనే పెట్టాడు. గ‌తంలో ఒక‌సారి ఆయ‌న టాడిపి నుంచి ప్ర‌చారం చేసిన విష‌య‌ము తెలిసిందే.

ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ సూప‌ర్‌స్టార్ హీరో కృష్ణ త‌న‌యుడిగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. అయితే హీరోగా ముందు కెరియ‌ర్ మొద‌లుపెట్టిన మ‌హేష్‌బాబు అన్న‌య్య‌ ర‌మేష్‌బాబు ప‌ర్వాలేద‌నిపించుకన్నాడు. కానీ మ‌హేష్ 1999లో రాజ‌కుమారుడు చిత్రంతో హీరోగా అడుగు పెట్టి అక్క‌డి నుంచి త‌న అందం అభిన‌యంతో ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయాడు. ఒక్క‌డు చిత్రంతో స‌డెన్‌గా మ‌హేష్‌కెరియ‌ర్ ఒక్క‌సారిగా మారిపోయింది. కృష్ణ త‌ర్వాత తిరిగి అదే స్థాయిలో ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న హీరో మ‌హేష్‌బాబుకే వ‌చ్చింది.  సినిమా సినిమాకు కొత్త‌ద‌నంతోపాటు ప్ర‌యోగాల‌కు ఎప్పుడూ సిద్ధ‌మే అన్న‌ట్లు ఉంటాయి అయ‌న చిత్రాలు. ముఖ్యంగా తెలుగు సినిమాకు ఓవ‌ర్సీస్ మార్కెట్ పెంచింది మ‌హ‌ష్ సినిమాలే అని చెప్ప‌వ‌చ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌హేష్ ఏరియా వైజ్ రికార్డులు కూడా ఉన్నాయి. అప్ప‌ట్లో కృష్ణ‌కి ఎంత పేరు ఉందో అంత‌కు మించి టాలీవుడ్‌లో మ‌హేష్ క్రేజ్‌ను సంపాదించారు.


ప్ర‌భాస్ వ‌ర్షం చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు.  పెదనాన్న ఉప్పలపాటి ప్రభాస్ రాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పెదనాన్న ను మించిన రారాజుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.
ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా దూసుకుపోతున్న మిస్టర్ పర్‌ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. రీసెంట్‌గా ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు ప్రభాస్‌. ముందులో ఎక్కువ‌గా మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌భాస్‌. త‌ర్వాత త‌న‌దైన శైలితో అటు మాస్‌, ఇటు క్లాస్ ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇలా ఈ ముగ్గురు హీరోలు తమ కుటుంబాల వారసత్వ లను ఘనంగా నిలబెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.