భలే భలే మగాడివోయ్ సీక్వెల్?

శైలజా రెడ్డి అల్లుడు తర్వాత  ఇప్పటివరకూ  దర్శకుడు మారుతి కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. అటుపై మారుతి కొత్త కథలు, హీరోలను వెతికే బిజీ అయిపోయారు. తాజా సమాచారం ప్రకారం.. నేచురల్‌స్టార్ నానితో సినిమా చేస్తున్నాడన్నది తాజా అప్ డేట్. ఇప్పటికే మారుతి కథకు నాని గ్రీన్ సిగ్నెల్ కూడా ఇచ్చేసాడుట. అంతే కాదు ఈ సినిమాని నాని నిర్మిస్తున్నారట. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నాని జెర్సీలో నటిస్తున్నాడు. అది పూర్తికాగానే విక్రమ్. కె. కుమార్ ప్రాజెక్ట్ సెట్స్  కు తీసుకెళ్లనున్నాడు. అనంతరం మారుతి తోనే తన ల్యాండ్ మార్క్ మూవీ నాని 25ని ప్రారంభించనున్నాడని  సమాచారం. ఈలోగా మారుతి ప్రీప్రొడక్షన్ పనులు అన్ని పనులు పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది.  గతంలో వీళ్లీద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నాని – మారుతి కాంబినేషన్ అనగానే భలే భలే మగాడివోయ్ సీక్వెల్ తీస్తున్నారా? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published.