నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారిన శ్రీ‌రెడ్డి కొత్త వ్యాపారం…?

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో ఐదు మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించించి సోషల్ మీడియా సంచలనం‌గా మారింది. అయితే ఫేస్ బుక్‌తో పాటు యూట్యూబ్‌లోనూ తన ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్‌ని లాంఛ్ చేసి వరుస వీడియోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌ని లైవ్ ఇచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తన పర్శనల్ విషయాలతో పాటు పొలిటికల్ జర్నీ, లవ్, పెళ్లి, సినిమాలు తదితర విషయాలను తెలియజేస్తూ త్వరలో శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేసింది. అయితే ఇందులో మొదట  ప్రాధాన్యత తమిళ తంబీలకే ఇస్తానంటోంది శ్రీరెడ్డి. సినీ పరిశ్రమలో అవకాశాలు దొరక్క కష్టపడుతున్న ఫ్రెషర్స్‌కి శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ ద్వారా బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్టు తెలిపింది.

మరి శ్రీ రెడ్డి సినిమాలో ఛాన్స్ దక్కించుకునే నటీనటులు ఎవరో ? అన్న ఆసక్తి ఇప్పుడు ఎక్కువైంది. మొత్తానికి మీ టూ వ్యవహారంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ రెడ్డి బ్యానర్ మొదలెట్టడంతో కొందరు నిర్మాతలు షాక్ కి గురయ్యారట. మరి ఈ బ్యానర్ లో ఈమె ఎలాంటి సినిమాలు తీస్తుందో అని ప్రశ్నించుకుంటున్నారు. మ‌రో ప‌క్క అవ‌కాశాలు రాని వారంద‌రూ శ్రీ‌రెడ్డినే  ఎక్కువ సంప్ర‌దిస్తార‌న్న ఊహాగానాలు కూడా వ‌స్తున్నాయి.

సినిమా రంగంలో అవకాశాలు దొరక్క‌.. కష్టపడుతున్న కొత్త వారికోసమే ఈ బ్యానర్ ని మొదలెట్టాను అని చెప్పిన శ్రీ రెడ్డి .. తన బ్యానర్ లో మొదట‌ సినిమా విషయంలో మాత్రం ముందు తమిళ నటీనటులకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపింది. ఆ తరువాత తెలుగువారి గురించి ఆలోచిస్తా .. అని చెప్పి షాక్ ఇచ్చింది. న్నాళ్లు నటిగా నిలదొక్కుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి పెద్దగా వర్కవుట్ కాలేదు .. దాంతో ఆమె సొంతంగా సినిమా నిర్మాణ రంగంలోకి దిగేందుకు రెడీ అయింది.


Leave a Reply

Your email address will not be published.