అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు.!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు పార్టీ హస్తినను మరోసారి ఊడ్చేసింది. ముచ్చటగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్లింది. ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం ఢిల్లీ పరిధిలోని 70 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఆమ్ ఆద్మీ పార్టీ 57 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 13 స్థానాల్లో ముందజలో ఉంది. ఇక కాంగ్రెస్ అయితే ఖాతా కూడా తెరవకపోవడం కొసమెరుపు.
అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైన ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ శాసనసభను రద్దు చేశారు. సాంప్రదాయం ప్రకారం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉంటే… ముచ్చటగా మూడోసారి సీఎం కాబోతూ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలిసింది.