అర్జున్‌కి మ‌లైకా న్యూ ఇయ‌ర్ గిఫ్ట్ అదిరిందిగా?


అర్భాజ్‌ఖాన్‌తో డైవ‌ర్స్ తీసుకుని అత‌నితో త‌న వైవాహిక బంధాన్ని తెంచుకున్న మ‌లైకా అప్ప‌టి నుంచి అర్జున్‌క‌పూర్‌తో బ‌హిరంగంగా తిర‌గ‌డం మొద‌లుపెట్టింది. రెండేళ్లు కావ‌స్తున్నాడేటింగ్‌లోనే వున్న ఈ జంట బాంద్రా వీధుల్లో మీడియాకు, ప‌బ్లిక్‌కి క‌నువిందు చేస్తున్నారు. పెళ్లి విష‌యం వ‌చ్చేస‌రికి ఇప్పుడు పెళ్లేంట‌ని దాట‌వేస్తున్న ఈ జంట తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన ఓ ఫొటో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

 వీరు  ప్రేమలో ఉన్నారని వారి సాన్నిహిత్యం చూస్తే అర్థం అవుతుంది. కానీ  ఆ విషయాన్ని వారు  ఎప్పుడూ ప్రకటించలేదు. ప్రతి  సందర్భంలో  ఒకరి మీద మరొకరికి ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు. న్యూ ఇయర్‌ సందర్భంగా మలైకా..అర్జున్ ని ముద్దాడుతున్న ఫోటో ని సోషల్ మీడియాలో  షేర్ చేసింది  మలైకా అరోరా. ఈ ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త కూడా  ప్రచారంలో ఉంది.  ఈ పిక్ తో ఆ వార్త నిజమనే అనిపిస్తుంది.బాధ్య‌త‌గ‌ల కుటుంబాల‌కు చెందిన ఈ ఇద్ద‌రు ప‌బ్లిగ్గా రెచ్చిపోవ‌డం ఏమీ బాగాలేద‌ని బాలీవుడ్ స‌ర్కిల్స్‌లో అర్జున్‌క‌పూర్‌, మ‌లైకాల‌పై సైటైర్లు ప‌డుతున్నాయి. అర్జున్ క‌పూర్‌ని ముద్దాడుతున్న ఫొటోని మ‌లైకా ఇన్‌స్టాలో పోస్త చేయ‌డం ఆస‌క్తికరంగా మారింది.


ఇదిలాఉంటే అర్జున్‌కపూర్, మలైకా అరోరాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలుసార్లు కెమెరా కంటికి చిక్కడంతో త్వరలోనే ఒక్కటవ్వనున్నారనే వార్త కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతోంది.

Leave a Reply

Your email address will not be published.