మెగా మేన‌ల్లుడి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ `రేయ్‌` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌ర్వాత `పిల్లా నువు లేని జీవితం` చిత్రంతో ప‌ర్వాలేద‌నిపించుకున్నా ఆశించినంత పేరు మాత్రం రాలేదు. ఆ త‌ర్వాత సుప్రీమ్‌, చిత్ర‌ల‌హ‌రి చిత్రాలతో మంచి హిట్‌లు కొట్టి ప్ర‌స్తుతం ఊపందుకున్నాడు. ప్ర‌స్తుతం తాజాగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో `ప్ర‌తి రోజు పండ‌గే` చిత్రంతో అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఇటు యూత్‌ని అల‌రించ‌బోతున్నాడు. ఇటీవ‌లె విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు పోస్ట‌ర్ల‌కు అన్యూహ్య స్పంద‌న ల‌భించింది.

ఇక ఈ నెల 20 ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సాయి ధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ… ఇక పై ఆయ‌న న‌టించే చిత్రాల‌న్నీ స‌క్సెస్ బాట‌లోనే న‌డుస్తాయ‌ని. అందుకు త‌గిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుని క‌థ‌ల‌ను ఎంచుకునే నేప‌ధ్యంలో క‌థ‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌ను మాత్ర‌మే చేస్తాన‌ని ఆయ‌న తెలిపారు. గ‌తంలో చేసిన త‌ప్పుల‌ను తిరిగి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త వ‌హిస్తాన‌న్నారు. స‌క్సెస్ అనేది మ‌న చేతిలో లేని విష‌యం. ప్రేక్ష‌కుల నాడి  తెలిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల‌మైన చిత్రాల్లో ఫ్లాప్‌లు అనేవే ఉండ‌వు. ఏది ఏమైన‌ప్ప‌టికీ సాయితేజ్‌కి ఇక పై అన్నీ స‌క్సెస్‌లే రావాల‌ని కోరుకుందాం.

 హీరో సాయిధరమ్‌ తేజ్ హీరోగానే కాక మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 42 లో బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌ గా వెళ్తున్న వ్యక్తికి ఎదురుగా కారు అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో బైక్ కింద పడిపోగా బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్‌ ఆ వ్యక్తిని చేరదీశాడు. గాయపడ్డ వ్యక్తిని తానే స్వయంగా ఎత్తుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ కారులో ఎక్కించాడు. అక్కడి నుంచి అతడిని తన కారులోనే ఆస్పత్రికి తరలించారు. అయితే విషయం ఆరా తీస్తే గాయపడ్డ వ్యక్తి సాయి ధరమ్‌ తేజ్ స్నేహితుడే అని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published.