తలైవి డీసెంట్ కెరీర్

సెకండ్ ఇన్నింగ్స్ లో నయన్ తలైవిగా ఎదిగిన తీరు అద్భుతం. వరుసగా భారీ కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ నయన్ కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. అన్ని పరిశ్రమల్లో అగ్ర కథానాయకుల సరసన నటిస్తూ ఇండస్ట్రీ బెస్ట్ స్టార్ గా వెలిగిపోతోంది. ఇటీవలే నాయికా ప్రధాన సినిమాల్లో నటిస్తూ బిజినెస్ ని ప్రభావితం చేయగలిగే తారగానూ నిరూపించింది. చిరంజీవి, బాలకృష్ణ, అజిత్ వంటి స్టార్లకు ఏకైక ఆప్షన్ గా మారింది నయన్. సేమ్ టైమ్ తలైవి చుట్టూ తిరిగే కథాంశాలతో దర్శకులకు మంచి అవకావాలొస్తున్నాయి.
గత కొంతకాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమాయణం మరో హాట్ టాపిక్. ఈ జంట పెళ్లి గురించి కంటే సహజీవనానికే ప్రాముఖ్యతనివ్వడంపైనా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 34 వయసులోనూ నయనతార బిగి సడలని అందాలతో మత్తెక్కించడంపైనా యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా సామాజిక మాధ్యమాల్లో నయనతారకు సంబంధించిన ఓ ఫోటో జోరుగా వైరల్ అవుతోంది. ఓ సింపుల్ శారీలో సాధా సీదాగా కనిపిస్తూనే మైమరిపిస్తోంది. నయన్ కెరీర్ ని పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టులతో బెస్ట్ ఫేజ్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన `సైరా-నరసింహారెడ్డి`లో నాయికగా నటిస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన మురుగదాస్ దర్శకత్వంలోనూ నటించనుందని తెలుస్తోంది. చిరంజీవి -కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలోనూ నయన్ నే ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. దళపతి 63 సినిమాలోనూ నయన్ కథానాయిక. ఐరా, కొలయితిర్ కాలమ్, లవ్ యాక్షన్ డ్రామా, మిస్టర్ లోకల్ చిత్రాల్లోనూ నయన్ కథానాయిక. ఇవేగాక నాయికా ప్రధాన స్క్రిప్టుల్ని ఎంచుకుని నయన్ నటిస్తోంది.