అఖిల్ విష‌యంలో ‘క్రిష్ షాక్‌’

అక్కినేని అఖిల్ న‌టించిన లేటెస్ట్ మూవీ మిస్ట‌ర్ మ‌జ్ను. తొలిప్రేమ చిత్రంతో విజ‌యం సాధించిన యువ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిస‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్స్ రావడం లేదు. దీంతో అఖిల్, హ‌లోతో పాటు మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రం కూడా ఫ్లాప్ చిత్రాల లిస్ట్ లో చేరిన‌ట్లే

దీంతో అఖిల్ నాలుగ‌వ సినిమా ఎవ‌రితో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. శ్రీను వైట్ల‌తో అఖిల్ సినిమా క‌న్ఫ‌ర్మ్ అయ్యింది అని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత శ్రీను వైట్ల కాదు.. ఆది పినిశెట్టి సోద‌రుడు స‌త్య ప్ర‌భాస్ పినిశెట్టితో చేయ‌నున్నాడు అనే టాక్ వ‌చ్చింది.

తాజాగా విభిన్న‌ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్‌తో అఖిల్ సినిమా అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. విష‌యం ఏంటంటే… అఖిల్ న‌టించిన మూడు చిత్రాలు స‌క్సెస్ కాక‌పోవ‌డంతో నాగార్జున అఖిల్ సినిమా విష‌య‌మై క్రిష్‌తో మాట్లాడార‌ని.. క్రిష్ తెర‌కెక్కిస్తోన్న మ‌హా నాయ‌కుడు రిలీజ్ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో షాకింగ్ ఏంటంటే ఈ వార్త విన్న క్రిష్ కూడా షాక్ అయ్యాడు. అఖిల్‌తో సినిమా అనే ఆలోచ‌నే లేదు అంటూ తేల్చిచెప్పేశాడు క్రిష్‌.

Leave a Reply

Your email address will not be published.