కునుకు కరువైతే ఎలా ?


యోగ టీచర్స్ గా శిల్పాశెట్టి, అనుష్క శెట్టి వంటి తారలకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. శిల్పాశెట్టి యోగా క్లాసెస్ కి సంబంధించిన వీడియో సీడీ-డీవీడీలు మార్కెట్లో అసాధారణంగా పాపులరయ్యాయి. ఆ తర్వాత ఎందరో కథానాయికలు శిల్పాని అనుసరించే ప్రయత్న ం  చేశారు. శిల్పా శెట్టి క్లాసుల స్ఫూర్తితో నవతరం యోగా టీచర్లు ఉపాధి పొందారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సెలబ్రిటీలు యోగ సాధనను ఒక నిత్య వ్యాపకంగా మలుచుకుని ఆరోగ్యాల్ని కాపాడుకోవడానికి తనే స్ఫూర్తి అని చెబుతుంటారు. అంతటి పాపులారిటీ యోగాకు ఉంది. తాజాగా ఈ తరహా యోగా పాఠాల్ని చెప్పేందుకు మరో టీచర్ రెడీ అయ్యారు. ప్రస్తుతం కెరీర్ పరంగా అంతంత మాత్రంగానే బండి నెట్టుకొస్తున్న రియా సేన్ ఈ కొత్త టర్న్ తీసుకోవడం బాలీవుడ్ లో చర్చకొచ్చింది. తాజాగా రియా  యోగా క్లాసులు చెబుతున్న ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అ యంగ్ గాళ్ స్పోర్ట్ డ్రెస్ లో రకరకాల భంగిమల్లో వేడి పెంచుతున్న ఫోటోలు వైరల్ అయిపోతున్నాయి. రియా సేన్ .. పాపులర్ క్లాసిక్ నాయిక మున్ మున్ సేన్ కుమార్తె. తల్లి వారసత్వాన్ని నిలబెడుతూ తాను కూడా కథానాయిక అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో కెరీర్ ని మాత్రం సాగించలేకపోయింది.  రియా సోదరి రైమాసేన్ సైతం కథానాయికగా ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. రియా సేన్ ఇదివరకూ మంచు మనోజ్ సరసన నేను మీకు తెలుసా? అనే చిత్రంలో నాయికగా నటించింది. అటుపై టాలీవుడ్ లోనూ ఆశించిన అవకాశాలు దక్కలేదు.

Leave a Reply

Your email address will not be published.