‘వకీల్ సాబ్‘ ఫ‌స్ట్ సాంగ్ ప్రోమో విడుద‌లైంది..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇండ‌స్ట్రీకి పున‌రాగమ‌నం చేస్తున్న సినిమా  ‘వకీల్ సాబ్‘.  దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తరువాత ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన   పవర్ స్టార్ త‌న ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో నూ అంచ‌నాలు పెంచేఏలా   ఇటీవల రిలీజ్ అయిన ‘వకీల్ సాబ్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్  సూపర్బ్ రెస్పాన్స్ ని సంపాదించుకుంద‌న‌టంలో సందేహం లేదు.  ఇక శుక్ర‌వారం రాత్రి ఈ సినిమా నుంచి  ‘మగువ మగువ’ అనే పల్లవితో సాగె సాంగ్ ప్రోమోని తొలిసారిగా విడుద‌ల చేసింది  చిత్ర‌ యూనిట్. ఎస్ ఎస్ థమన్ అదిరిపోయే ట్యూన్ ల‌తో సంగీతం అందించిన ఈ పాట‌కి యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన తీరు  అద్భుతంగా సాగింది. ఇందుకు సంబంధించిన పూర్తి పాట‌ని  8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగాఅదేరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌కటించింది.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.   మే నెలలో వేస‌వి కానుక‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.