మహాశివరాత్రికి `మహర్షి` హంగామా!

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తోన్న `మహర్షి` షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. షూటింగ్ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకధాటిగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కీలక పాత్రలకు సంబంధించి డబ్బింగ్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. మరో 20 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తిచేసి గుమ్మడి కాయ కొట్టేయనున్నారని సమాచారం. ఇప్పటికే సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. `భరత్ అనే నేను` తర్వాత విడుదలవుతోన్న సినిమా కావడంతో అన్ని ఏరియాల్లో క్రేజీగా బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. పోస్టర్స్ , టీజర్ మహేష్ అభిమానులకు మంచి కిక్‌ని ఇచ్చాయి. తాజాగా మహా శివరాత్రికి `మహర్షి `హంగామా ఖాయం చేయనున్నట్లు తెలుస్తోంది.
శివరాత్రిని పురస్కరించుకుని మార్చి 4న మరో టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారుట. రిలీజ్ కు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో పండుగ స్పెషల్ గా టీజర్ ట్రీట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ టీజర్ నిడివి 35 సెకన్లు ఉంటుందిట. మహేష్ ని ఎలివేట్ చేస్తూనే టీజర్ కట్ చేశారని యూనిట్ నుంచి లీకులందాయి. మరి టీజర్ ఎంత ఆసక్తి పెంచుతుందో చూడాలంటే మార్చి 4 వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, అశ్వీనిదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మహేష్ ఈ చిత్రంలో బిజినెస్‌మేన్ గా, రైతు బాంధవుడిగా కనిపించనున్నారు.