గ్యాంగ్ లీడర్ ఏంటి కథ?

నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ప్రయత్నించడం నాని పద్ధతి. సహజసిద్ధంగా కనిపిస్తూనే, కథా వైవిధ్యం, పాత్రలో వైవిధ్యం కోసం ప్రయత్నిస్తుంటారు. అలా మొదలైంది, ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, మజ్ను, ఎంసీఏ, నేను లోకల్, జెంటిల్‌మేన్ చిత్రాల్లో నాని వెర్సటైలిటీ యువతరాన్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో క్రికెటర్ గా కనిపించనున్నారు. అందుకే అతడు నటిస్తున్న తాజా చిత్రంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్(సివిఎం) నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. ఈ టైటిల్ ప్రస్తుతం ఫిలింవర్గాల్లో ఆసక్తి పెంచుతోంది. రెగ్యులర్ షూటింగ్ కోసం రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ లో విడుదల కానుంది. నాచురల్ స్టార్ నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.