పెళ్లి కోసం పురుషునిగా మారిన లేడీ కానిస్టేబుల్

ఆమె ఓ కానిస్టేబుల్ కానీ ఓ యువతిని చూడగానే మనసు పారేసుకుంది. ఆ యువతి అందానికి దాసోహమైపోయింది. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఇద్దరూ అడవారే కావటంతో ఏం చేయాలో పాలు పోలేదు. దీనికి ఒకటే మార్గం ఆలోచించింది. తాను పురుషుడుగా మారాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా ఆ లేడీ కానిస్టేబుల్ పెద్దలని ఒప్పించి పురుషుడుగా మారిపోయింది. లింగమార్పిడి చేసుకోవడంతో తన కలను సాఫల్యం చేసుకుంది.
మహారాష్ట్ర బీడ్ జిల్లా మజల్ గావ్ మండలం రాజేగామ్ గ్రామంలో 1988 జూన్‌లో లలితా కుమారి సాల్వే పోలీసు దళంలో విధుల్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లాడాలనుకుంది. లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకుని, దీనికి ఉన్నతాధికుల అనుమతులు కోరగా వారు అంగీకరించలేదు. దీంతో లలిత బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో, మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను సంప్రదించాలని సాల్వేను హైకోర్టు సూచించడంతో సాల్వేకు సెక్స్ మార్పిడి సర్జరీ చేసుకునేందుకు వీలుగా హోంశాఖ అనుమతులు ఇస్తూ అందుకు సెలవు కూడా మంజూరు చేసింది. దీంతో ఆమె ఉద్యోగ సమస్యకు పరిష్కారం లభించింది.
ముంబైలోని ఒక ఆసుపత్రిలో సెక్స్ ఛేంజ్ చేయించుకుని మహిళ నుంచి పురుషునిగా మారిన లేడీ కానిస్టేబుల్ ఇప్పుడు లలిత్ అలియాస్ లలిత్ సాల్వేగా మారిపోయాడు. ఈ నెల 16వ తేదీన ఔరంగాబాద్‌లోని ఒక దేవాలయంలో అతి కొద్దిమంది బంధుమిత్రులు సమక్షంలో వీరి అంగరంగ వైభవంగా జరిగింది.