వింక్ గాళ్ క్రేజ్.. బన్ని అండ పెద్ద ప్లస్! లవర్స్ డే’ నిర్మాతలు గురురాజ్ , వినోద్ రెడి

ఒకే ఒక్క కన్నుగీటుతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ మలయాళ బ్యూటీ నటించిన చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ సంచలనాల గురించి తెలిసిందే. తొలి టీజర్ కోటి వ్యూస్‌తో సంచలనం   సృష్టించింది. సన్నీలియోన్, దీపిక పదుకొనే లకు లేని క్రేజు ప్రియా వారియర్ ఒకే ఒక్క వింక్‌తో సంపాదించింది. ఆ తర్వాత ఆ సినిమా కాన్వాసు అమాంతం మారిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం  తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలవుతోంది. ఇటీవలే రిలీజైన పాటలు ఆకట్టుకున్నాయి. గురురాజ్ , వినోద్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈనెల 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విలేకరులతో నిర్మాతల చిట్ చాట్ ఇది..

ఈ సినిమా ఎంపిక కారణం ?
సినిమాపై ఉన్న ప్రేమ.. ఇష్టంతోనే గట్టి పోటీ మధ్య భారీ ధర పెట్టి ఈ సినిమాను చేజిక్కించుకున్నాం. అంతా కొత్త వారితో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ప్రియా ప్రకాష్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ వుంది.
వందశాతం నమ్మకంగానే ఉన్నట్లున్నారు!
సినిమా తొలి కాపీ రెడీ అయ్యింది. ఒకసారి చూడండి అని దర్శకుడు ఫోన్ చేసినప్పుడు కొంచెం భయంగానే వెళ్లాం. కానీ సినిమా చూశాక చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నాం.
యూత్ కు మాత్రమే ప్రత్యేకమా?
చిన్నా పెద్దా అంతా  కలిసి ఈ చిత్రాన్ని చూడచ్చు. 60 సంవత్సరాల వయసు వారు  ఈ సినిమా ని బాగా ఎంజాయ్ చేస్తారు. వారిని మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లుతుంది. అందరు కొత్తవారైనా చాలా అనుభవం వున్నవారిలా నటించారు.
ప్రీ రిలీజ్  లో ఎమోషన్ అయ్యారు?
అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా సినిమా ఈవెంట్ కు రావడంతో ఆరోజు చాలా సంతోషం కలిగింది. ఆ హుషారులోనే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఆయనకు మాళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. బన్ని రావడం సినిమా ప్రమోషన్స్ కు చాలా హెల్ప్ అయ్యింది.
దర్శకుడి పనితనం గురించి?
ఈ సినిమాని దర్శకుడు ఒమర్ లులు చక్కగా తెరకెక్కించారు. యువతరంతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేంతగా తీర్చిదిద్దారు. రిలీజ్ తర్వాత అతడికి మంచి పేరొస్తుంది.
ప్రీ రిలీజ్ బిజినెస్ పై?
చాలా బాగా జరిగింది. ఒక్కో ఏరియా నుండి 10 నుండి 15 మంది పంపిణీదరులు ఈ సినిమాని కొనుక్కోవడానికి వచ్చారు. అలాగే కొన్ని రికమెండేషన్లు కూడా వచ్చాయి. బిజినెస్ పరంగా ఎలాంటి సమ్యస లేదు.

Leave a Reply

Your email address will not be published.