న‌య‌న‌తార హిందూ మతంలోకి మారిందా…

సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న‌నయనతార స్వ‌త‌హాగా క్రిష్టియన్‌ అయినప్ప‌టికీ శ్రీ‌రామ‌రాజ్యంలో సీత లాంటి పాత్ర‌లు న‌టించి మెప్పించింది. నయనతార ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ మ‌ధ్యే తెలుగులో సైరా లాంటి చారిత్రిక చిత్రంలో నటించింది.తాజాగా త‌మిళంలో ప్ర‌ముఖ సంస్థ రూపొందిస్తున్న భ‌క్తి ప్రాధాన్య‌త చిత్రంలో అమ్మవారి పాత్రలో నటించేందుకు ఓకే చెప్పింది న‌య‌న‌. ఈ పాత్ర కోసం దీక్షకు కంకణం కూడా కట్టుకుంది దేవ‌త పాత్ర కావటంతో ఈ సినిమా షూటింగ్ జ‌రిగినంత కాలం దీక్షలో ఉంటానని, మాంసహారం ముట్టనని తెలిపిన‌ట్టు స‌న్నిహిత వ‌ర్గాలు చెపుతున్నాయి.దైవత్వ ఉన్న పాత్రలు పోషించే సందర్భంలో ఎన్టీఆర్‌తో స‌హా ఎంద‌రో ఆర్టిస్టులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇండ‌స్ట్రీలో సహజమే, కానీ క్రిస్టియ‌న్ అయిన‌ నయన్ ఈ దీక్ష చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గుస‌గుస‌లు వినిపిస్తుంటే, చాలా  ఏళ్ల‌ క్రితమే న‌య‌న‌తార హిందూ మతంలోకి మారారని సన్నిహితులు చెబుతుండ‌టం విశేషం.  

Leave a Reply

Your email address will not be published.