ప‌వ‌న్‌తో సినిమానా అమ్మా వ‌ద్దంటున్న నిర్మాత‌లు


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమాలు చేయాలంటే నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఎందుకంటే గ‌త కొంత కాలంగా ఆయ‌న రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఒక‌వేళ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నానిబ‌ద్ధ‌త‌తో ఆయ‌న ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తారా లేదంటే ఆయ‌న‌కున్న బిజీలో స‌రిగా చేయ‌రేమో అన్న అనుమానాలు టాలీవుడ్‌లో ఎన్నో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణాలు లేక‌పోలేదు. గ‌త చిత్రం వ‌వ‌న్ న‌టించిన అజ్ఞాత‌వాసి ఆశించినంత ఫ‌లితం రాలేదు. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆ చిత్రం స‌మ‌యంలో ఆయ‌న రాజకీయాల‌తో బిజీఆ ఉండ‌డం వ‌ల్ల షూటింగ్‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలిపెట్టి వెళ్ళ‌డంతో సినిమా పోయింద‌నే టాక్ వినిపించింది. తిరిగి మ‌ళ్ళీ ఇప్పుడు ఆయ‌న‌తో సినిమా చేస్తే ఆయ‌న పూర్తిగా చేస్తారా లేక స‌గంలోనే వ‌దిలిపెట్టి వెళ్ళిపోతాడా అన్న అనుమానాలు వ‌స్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఏపీలో  మరో నాలుగున్నరేళ్ల వరకు ఎన్నికలు లేకపోవడంతో ఈ గ్యాప్‌లో కొన్ని సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అది కూడా సామాజిక నేపథ్యంలో ఉన్న కథాంశాలే చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ కోవలోనే హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను ముఖ్యపాత్రలో నటించి సూపర్ హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.