మాతృ వందన వారోత్సవాల గోడపత్రిక విడుద‌ల‌


మాతృ వందన వారోత్సవాల గోడపత్రికను జిల్లా కలెక్టర్ జె.నివాస్ విడుదల చేసారు. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాతృవందన వారోత్సవాల కార్యక్రమాన్నినిర్వహిస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్  తెలిపారు. 

3వ తేదీన అనుబంధ శాఖలతో అవగాహనా సదస్సులు, 4వ తేదీన నమోదు కాని గర్భిణీల నమోదు కార్యక్రమం, 5వ తేదీన ఆధార్ మరియు బ్యాంక్ అక్కౌంట్ల సమస్యలు పరిష్కరించే కార్యక్రమం, 6వ తేదీన కరక్షన్ క్యూ క్రింద 2వ మరియు 3వ విడత నిధుల విడుదలపై శ్రధ్ధ వహించుట 7వ తేదీన రక్తహీనత దిశగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య ఆహార మరియు పరిశుభ్రతపై అవగాహన కలిగించుట, 8వ తేదీన ఈ కార్యక్రమాలలో అత్యంత ప్రగతి సాధించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు సన్మాన కార్యక్రమం జరుగుతాయని తెలిపారు. 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం క్రింద వివిధ విడతలలో నగదును మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎ.ఎన్.ఎం. ద్వారా గర్భిణీగా నమోదు చేయించుకున్నందులకు 1000 రూపాయలు, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ పరీక్షలు చేయించుకున్నందుకు 2 వేల రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకున్నందుకు జనని సురక్ష యోజన క్రింద గ్రామీణులకు 1000 రూపాయలు పట్టణ ప్రజలకు 600 రూపాయలు జనన మరియు మొదటి విడత 3 టీకాలు వేయించుకున్నందుకు 2,000 రూపాయలు  మంజూరు చేయడం జరగుతుందని చెప్పారు. లబ్దిదారులు తమ ఆధార్ కార్డుకి భర్త యొక్క పేరు మరియు బ్యాంక్ అక్కౌంట్ నెంబరు తప్పనిసరిగా లింక్ చేయించుకోవాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.