చిరు బయోపిక్‌పై మెగా స్పందన!

మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కించనున్నారని ఇటీవల ప్రచారమైంది. అయితే ఈ బయోపిక్ తీయాల్సిన అవసరం లేదని మెగాబ్రదర్ నాగబాబు వ్యాఖ్యానించడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. నాగబాబు ఓ మీడియాతో మాట్లాడుతూ.. చిరుపై బయోపిక్ తీయాల్సిన అవసరం లేదు. సినీ కెరీర్ ఆరంభంలో తను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అంతా విజయవంతమైన జీవితాన్నే గడిపాడు. కానీ సావిత్రి, సిల్క్ స్మిత, సంజయ్‌దత్‌ల విషయం వేరు. వారి జీవితాల్లో ఎన్నో ఒడుదొడుకులను చవిచూశారు. కాబట్టి వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారు. చిరు జీవితంలో అలాంటివేమీ లేవు. కాబట్టి రామ్‌చరణ్ తన తండ్రి బయోపిక్ తీయకపోవడమే ఉత్తమం .. అంటూ అభిప్రాయపడ్డారు. ఇటీవలే నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో తడబడింది. వైయస్సార్ బయోపిక్ యాత్ర స్వల్ప నష్టాలను చవి చూడడంపైనా ఆసక్తికర చర్చ సాగింది.

Leave a Reply

Your email address will not be published.