నాని సరసన వింక్ బ్యూటీ

వింక్ గాళ్ ప్రియా వారియర్ అదృష్టం పరిగెడుతోందా? అంటే అవుననే అర్థమవుతోంది. ఒకే ఒక్క కన్ను గీటుతో ప్రపంచాన్ని దాసోహం అయ్యేలా చేసుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం భారీ క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. `ఒరు ఆధార్ లవ్` రిలీజ్ కి ముందే ఈ భామకు టాలీవుడ్ గ్రాండ్ వెల్ కం చెప్పింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రియాకి పిలిచి మరీ ఛాన్సిచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రియా ఆ ఆఫర్ ని వదులుకుంది.
తాజా సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ నాని సరసన ప్రియా ప్రకాష్ క్రేజీ ఆఫర్ ని దక్కించుకుందట. నాని హీరో మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ప్రియా ప్రకాష్ ని కథానాయికగా ఎంపిక చేశారట. త్వరలోనే ఆడిషన్స్ కి ఎటెండ్ అవ్వాలని విక్రమ్ తనని పిలిచారని తెలుస్తోంది. ఆరంభమే నాని లాంటి లక్కీ గయ్ తో లక్కీ ఛాన్స్ కొట్టేస్తోంది ఈ అమ్మడు అంటూ అప్పుడే వాడి వేడిగా చర్చ సాగుతోంది. వింక్ గాళ్ గా ప్రియా ఇప్పటికే వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. జాతీయ స్థాయిలో మీడియా అటెన్షన్ తో తనకు అసాధారణ పాపులారిటీ దక్కింది. అందుకే ఈ బ్యూటీ ని ఎంపిక చేసుకుంటే ఆ సినిమాపై జాతీయ స్థాయి మీడియా ఫోకస్ ఉంటుందనడంలో సందేహం లేదు. నానీ- విక్రమ్ కె ఆప్షన్ సరైనదేనని చెప్పొచ్చు. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా రిలీజవుతోంది. ఈ సినిమా విజయం అందుకుంటే తెలుగులో ఈ బ్యూటీ యువహీరోల సరసన అవకాశాలు అందుకునే ఛాన్సుంది.