సినీ నటులను చూసి, రాజకీయనాయకులు నేర్చుకోవాలంటున్న ప్రజలు ..

ఓ ప్రయివేటు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పిలస్తే… అక్కడా పార్టీలు, రాజకీయాలు, ప్రభుత్వం, పథకాలు అంటూ సిఎం భజనలో మునిగితేలిన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, సీనియర్ నటుడు విజయ్ చందర్కి ఊహించని పరాభవం ఎదురయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకెళితే….
గుంటూరులోలో శుక్రవారం కళావాహిని సాహితీ సంస్ధ సారధ్యంలో ఇక్కడి బృందావన్ గార్డెన్స్‌లో ఓ సాంస్కౄతిక కార్యక్రమానికి నటుడు విజయచందర్‌ని అతిధిగా హాజరయ్యారు.
కానీ సభ దేనికి జరుగుతోందో చూడని, విజయ చందర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్నపథకాలపై ప్రశంసలు కురిపించడంతో పాటు. జగన్ పాలన ని ఆయనను ఆకాశానికి ఎత్తడం ఆరంభించారు. అసలు విఫయం వదిలేసిన విజయచందర్ కొసరు మాటలు ఎక్కువ కావటం వేదిక మీద ఉన్న అతిధులకు కూడా నచ్చలేదు.
దీంతో ఈ వేదిక రాజకీయాల కోసం కాదంటూ స్టేజిపై ఉన్న వారు నిర్మొహమాటంగా తమ అసంతృప్తి పి బహిరంగంగా వ్యక్తం చేస్తూ వేదిక పైనుంచి లేచి వెళ్ళిపోయారు. అంతా ఖాళీ అవుతుండటంతో సభ వెలవెలబోయింది. దీంతో నిర్వాహకులు స్పీచ్‌ని అర్ధంతరంగా ఆపేయించారు. చేసేదేమి లేక ఆయన కూడా ఆపేసి, కారులో బయలుదేరుతుండగా స్థానికులు ఆయనకు అడ్డుతగిలారు. అమరావతిపై మీ స్టాండ్ చెప్పాలంటూ ఆందోళన చేశారు. సభలో ఇష్టానుసారం ఎలా మాట్లాడతారంటూ నిలదీసారు. దీంతో వారికి విజయ చందర్ సారీ చెప్పి వెళ్ళిపోయారు. సందర్భాను సారంగా మాట్లాడకుంటే ఏం జరుగుతుందో తాజా ఘటన చూసి రాజకీయనాయకులు నేర్చుకోవాలని అంటున్నారు జనాలు.