‘విధి విలాసం’ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా నరేష్ గుత్తా…

ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ బేనర్ పై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మాతగా అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘విధి విలాసం’. హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో హీరోహీరోయిన్లపై షూట్ చేసిన ముహూర్తపు సన్నివేశంతో షూటింగ్ ఆరంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ కొట్టగా డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.
అనంతరం మీడియా సమావేశంలో.. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ – “ఆదిత్ తో నా తొలి సినిమా చేయడం సంతోషంగా ఉంది. శివాత్మిక కు మంచి పెర్ఫార్మెన్స్ చూపించే స్కోప్ ఉన్న పాత్ర , రామాయణం ఎలాగ మూడు కోణాలలో ఉంటుందో మా ‘విధి విలాసం’ కూడా అలాగే ఉంటుంది” అన్నారు
చిత్ర కథానాయిక శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ – ” కథ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎగ్జైటింగ్ గా ఉంది, తప్పకుండా అందరికి నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.
నిర్మాత శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి మాట్లాడుతూ – “ హీరో ఆదిత్, హీరోయిన్ శివాత్మిక లు ఈ కథకు యాప్ట్ అనిపిస్తారు. ఫిబ్రవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి,. సమ్మర్ రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ – “ఈ ఏడాది నాకు రెండో సినిమా. దశరథ్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన దుర్గ నరేష్ నిర్మాత శివ గారు ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ ఒకే చేశారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అన్నారు.