లారీ నిండా కండోమ్స్.. రోగాలొస్తాయంటున్న జనం.. అసలేంజరిగింది..?సురక్షిత శృంగారం కోసం, గర్భం రాకుండా ఉండ‌టం కోసం వాడేదే కండోమ్‌.   ప్రతి వంద మంది జంటలో రెండు జంటలు మాత్రమే దీర్ఘకాలం పాటు కండోమ్ ను సరిగా ఉపయోగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వీటిలో కూడా మంచి నాణ్య‌మైన‌వి వాడాలి. అలాగే అవి వాడే ముందు ఒకసారి దాని పైన ఉన్న డేట్‌ను చెక్ చేసుకుని వాడాలి. ఎందువ‌ల్ల‌నంటే ర‌క ర‌కాల మెడిసెన్స్‌తో, ర‌సాయ‌నాల‌తో త‌యార‌య్యే ఈ కండోమ్స్ డేట్ మారిన త‌ర్వాత వాడ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌క‌పోగా వాటి వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు వచ్చే అవ‌కాశం ఉంటుంది.

ఇక ఇదిలా ఉంటే…ఇటీవ‌లె ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో సోహరామావ్‌లో ఓ మూసివేసిన ఇటుకల గూడౌన్‌కి కొన్ని లారీలు వచ్చి ఆగాయి. . అందులో ఉన్నలోడ్ మొత్తం దించుతుంటే సడెన్‌గా  కండోమ్స్ బ‌య‌ట ప‌డ్డాయి. వాటిని చూసిన‌ స్థానికులు ఆగ్రహానికి గురై.. లారీ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. అయితే.. అవన్నీ కాలం చెల్లిన కండోమ్స్ అని.. లక్నో గవర్నమెంట్ ఆస్పత్రికి చెందినవని.. వాటిని అక్క‌డ కాల్చ‌డానికి తీసుకొచ్చామ‌ని.. తమను అడ్డుకోవద్దని లారీ డ్రైవర్లు చెప్పారు. వీటిని ఇక్కడ పడేసి తగుల బెట్టాలని అన్నారు.


అయితే.. అందుకు స్థానికులు ఒప్పుకోలేదు. వీటిని కాల్చడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని లేనిపోని జ‌బ్బులు వ‌స్తాయ‌ని వేరే చోట ఎక్కడికైనా తీసుకెళ్లాలని గొడవకు దిగారు స్థానికులు. అక్కడికి మరికొంతమంది గ్రామస్థులు చేరుకోవడం చూసి.. భ‌య‌ప‌డిన లారీ డ్రైవర్లు మెల్లగా అక్క‌డి నుంచి జారుకున్నారు. అయితే ఇప్పుడు వాటితో ఎన్ని ప్రమాదాలు వస్తాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published.